Samantha : నీలాంటి వాళ్లు జీవితంలో ఉండాలి.. నువ్ లేకుండా నేనేం చేయలేను : సమంత

Samantha Ruth Prabhu Friend సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. మయోసైటిస్ కారణంగా ఓ ఐదారు నెలలు సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉంటూ వచ్చింది. అయితే సమంత ఇప్పుడు తన ఫ్రెండ్ గురించి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2023, 02:11 PM IST
  • నెట్టింట్లో యాక్టివ్ అయిన సమంత
  • తన ఫ్రెండ్ మీద సామ్ ఎమోషనల్
  • నందినీ రెడ్డి బర్త్ డేపై సమంత పోస్ట్
Samantha : నీలాంటి వాళ్లు జీవితంలో ఉండాలి.. నువ్ లేకుండా నేనేం చేయలేను : సమంత

Samantha Ruth Prabhu Friend సమంత గురించి, ఆమె ఫ్రెండ్స్ గురించి అందరికీ తెలిసిందే. సమంత చుట్టూ ఎప్పుడూ ఓ గ్యాంగ్ ఉంటుంది. సింగర్ చిన్మయి, డాక్టర్ మంజుల, సాధన సింగ్, ప్రీతమ్, నందినీ రెడ్డి ఇలా చాలా మందే ఉంటారు. సమంత తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా వారి ప్రభావం గట్టిగానే ఉంటుందని అంతా అంటుంటారు. సమంత ఎక్కువగా వీరితోనే ఉంటుంది. శిల్పా రెడ్డితోనూ సమంత ఈ మధ్య ఎక్కువగానే ఉంటోంది.

అయితే సమంత మాత్రం తన ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ గొప్పగానే చెబుతుంది. తాజాగా నందినీ రెడ్డి మీద తన ప్రేమను కురిపించింది. జబర్దస్త్, ఓ బేబీ సినిమాలతో సమంత నందినీ రెడ్డిలు మ్యాజిక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో జబర్దస్త్ అనే సినిమా సమంత జీవితంలో చేదు అనుభవంగా మిగిలింది. ఈ సినిమా సమయంలోనే సమంత సిద్దార్థ్ ప్రేమాయణం చిగురించింది.

ఆ సమయంలో నందినీ రెడ్డియే సమంతకు తోడుగా ఉందని, నాటి డిప్రెషన్ టైంలో సమంతకు అండగా నిలిచిందని అంటుంటారు. అయితే సమంత ఇప్పుడు నందినీ రెడ్డి మీద కామెంట్ చేసింది. నందినీ రెడ్డి బర్త్ డే సందర్భంగా సమంత వేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నందినీ రెడ్డి లాంటి వాళ్లు జీవితంలో ఉండాలంటూ పొగిడేసింది.

ప్రతీ ఒక్కరి జీవితంలో నీలాంటి ఓ ఫ్రెండ్ ఒకరుండాల్సిందే.. ఎప్పుడూ బాధలు దరికి రానివ్వరు.. బాధ పడాల్సిన సమయంలోనూ నవ్విస్తుంటావ్.. ఎప్పుడూ ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తావ్.. నువ్ లేకుండా ఈ జీవితంలో నేనేం చేయగలను.. లవ్యూ.. హ్యాపీ బర్త్ డే అంటూ సమంత పోస్ట్ చేయగా.. నందినీ రెడ్డి రిప్లై ఇచ్చింది. సామ్.. బిగ్ హగ్స్.. లవ్యూ లోడ్స్ అంటూ రిప్లై పెట్టేసింది.

సమంత ప్రస్తుతం మయోసైటిస్ నుంచి కోలుకుంది. హెవీ వర్కౌట్లు చేస్తోంది. సిటాడెల్ షూటింగ్‌లో బిజీగా ఉన్న సమంత.. వచ్చే వారంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సెట్‌లో సందడి చేయనుంది. ఈ రెండు ప్రాజెక్టులను ప్రస్తుతం పూర్తి చేయాలనే కసితో సమంత ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ తరువాతే కొత్త సినిమాలను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా

Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News