Samantha Fans : అది సమంత విగ్రహమా?.. నెట్టింట్లో ట్రోల్స్, మీమ్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్లు

Samantha Ruth Prabhu statue సమంత కోసం ఆమె అభిమాని గుడి కట్టిస్తున్నాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ గుడిని ప్రారంభిస్తాడట. ఇక ఆమె విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది అసలు సమంతేనా? అని అనుమానం కలిగేలా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2023, 09:08 AM IST
  • నెట్టింట్లో సమంత ఫ్యాన్ సందడి
  • సమంత కోసం అభిమాని గుడి
  • సమంత విగ్రహం మీద ట్రోల్స్
Samantha Fans : అది సమంత విగ్రహమా?.. నెట్టింట్లో ట్రోల్స్, మీమ్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్లు

Samantha Ruth Prabhu statue హీరో హీరోయిన్లను అభిమానులు ఎంతగా ఆరాధిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా సౌత్‌ ఆడియెన్స్.. అందులోనూ తమిళ అభిమానులు అయితే ఏకంగా గుళ్లు కట్టించేస్తారు. అలా ఇప్పటికే చాలా మంది హీరోయిన్లకు గుళ్లు కట్టించారు. ఖుష్బూ, హన్సిక, నిధి అగర్వాల్ ఇలా చాలా మందికి అక్కడ గుళ్లు కట్టించారు. రజినీకాంత్‌ అభిమానులు కూడా ఓ గుడిని కట్టించారు. అయితే ఇప్పుడు ఈ వెర్రితనం తెలుగు అభిమానులకు కూడా పాకినట్టు అనిపిస్తోంది.

బాపట్లకు చెందిన సమంత అభిమాని ఓ గుడిని కట్టించాడట. సమంత బర్త్ డే (ఏప్రిల్ 28) సందర్భంగా ఆ గుడిని ప్రారంభిస్తాడట. ఇక ఇతనే ఇది వరకు సమంత కోసం ఎన్నో మొక్కుబడులు తీర్చుకున్నాడట. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్నప్పుడు త్వరగా కోలుకోవాలని ఎన్నో గుళ్లు గోపురాలు తిరిగాడట. తిరుమలకు మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్లాడట. అంతటి వీరాభిమాని ఇప్పుడు ఇలా గుడి కట్టించేస్తున్నాడట.

Also Read: Niharika Konidela : ఆమెతో కలిసి నైట్ సినిమా చూస్తూనే ఉందట.. ఎంజాయ్ చేస్తోన్న నిహారిక

అయితే సమంత విగ్రహం మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అది అసలు సమంత విగ్రహమేనా? అందులో కనిపించేది సమంతేనా? అంటూ ట్రోల్స్ మీమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు సమంత మీద ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో ఏడుస్తూ మొహం పెట్టి సింపతీ ట్రై చేసిన సమంత.. లండన్‌లో సిటాడెల్ ప్రమోషన్స్ కోసం మాత్రం నవ్వుతూ పొట్టి బట్టల్లో కనిపించింది. దీంతో జనాలు సమంతను ట్రోల్స్ చేస్తున్నారు.

 

సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా చేస్తూ ఉంది. సిటాడెట్ షూటింగ్ ఓ వైపు జరుగుతోంది. అయితే ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్న శాకుంతలం సినిమా సమంతను నిరాశపర్చింది. ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే పని చేయడం మన వంతు.. ఫలితం గురించి ఆలోచించొద్దు అంటూ గీతా సారాన్ని వల్లించింది సమంత. అంటే తాను సినిమాలు చేస్తూనే ఉంటానని, హిట్టైనా ఫట్టైనా పట్టించుకోనని చెప్పకనే చెప్పేసింది.

Also Read:  Payal Rajput Mangalavaram : నగ్నంగా పాయల్ రాజ్‌పుత్.. 'ఆర్‌ఎక్స్ 100'ని మించి ప్లాన్ చేసిన అజయ్ భూపతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News