Samantha Stylist Preetham : సమంతకు దూరంగా.. శ్రీజకు దగ్గరగా.. ప్రీతమ్ రూట్ మార్చేశాడా?

Samantha Stylist Preetham సమంత పర్సనల్ స్టైలిష్ట్‌గా ప్రీతమ్ ఒకప్పుడు వార్తల్లో రచ్చ చేశాడు. ప్రీతమ్, సమంత రిలేషన్ మీద రకరకాల రూమర్లు వచ్చాయి. ప్రీతమ్ ఒళ్లో సమంత కాళ్లు పెట్టుకుని పడుకున్న ఫోటో ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2023, 09:53 PM IST
  • నెట్టింట్లో ప్రీతమ్ జుకల్కర్ రచ్చ
  • సమంతకు దూరంగా ప్రీతమ్?
  • శ్రీజ కొణిదెలతో క్లోజ్‌గా స్టైలిష్ట్
Samantha Stylist Preetham : సమంతకు దూరంగా.. శ్రీజకు దగ్గరగా.. ప్రీతమ్ రూట్ మార్చేశాడా?

Preetham Jukalker Sreeja Konidela సమంత స్టైలిష్ట్‌గా ప్రీతమ్ జుకల్కర్ సోషల్ మీడియాలో బాగానే ఫేమస్ అయ్యాడు. సమంత, నాగ చైతన్యల విడాకుల సమయంలోనూ ప్రీతమ్ పేరు ఎక్కువగానే వినిపించసాగింది. ప్రీతమ్‌ తన మీద వచ్చిన రూమర్లను ఖండించాడు. సమంత తనకు అక్క లాంటిదని, ఇలాంటి రూమర్లు రావడం చాలా బాధగా ఉందని ప్రీతమ్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత సమంత, సాధన సింగ్, ప్రీతమ్‌లు కలిసి చాలానే సందడి చేశారు.

ఈ ముగ్గురూ కలిసి వెకేషన్లకు వెళ్తుండే వారు. సెట్స్‌లో నానా హంగామా చేసే వారు. కలిసి రీల్స్ చేసేవారు. అయితే సమంత ఎప్పుడైతే మయోసైటిస్ బారిన పడిందో.. ఈ గ్యాంగ్ సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇంత వరకు ఈ ముగ్గురూ కలిసి కనిపించలేదు. చూస్తుంటే ఈ ముగ్గురి మధ్య గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తోంది.

అయితే ప్రీతమ్ ఇప్పుడు ఎక్కువగా మెగా కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డికి స్పెషల్‌గా దుస్తులను డిజైన్ చేస్తున్నాడు. శ్రీజ కొణిదెలకు కూడా ప్రత్యేకంగా వస్త్రాలను డిజైన్ చేస్తున్నాడు. ప్రీతమ్ డిజైన్ చేసిన దుస్తులను వేసుకుని స్నేహారెడ్డి, శ్రీజలు చేస్తోన్న ఫోటో షూట్లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.

శ్రీజ ఇప్పుడు ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే. కళ్యాణ్‌ దేవ్‌తో విడాకులు అయ్యాయనే రూమర్లు గత కొన్ని నెలలుగా వస్తూనే ఉన్నాయి. కానీ ఇంత వరకు వాటి మీద అధికారికంగా స్పందించలేదు. ఇలాంటి సమయంలో శ్రీజ ఇలా ప్రీతమ్‌తో క్లోజ్‌గా ఉండటంతో అంతా అవాక్కవుతున్నారు. ప్రీతమ్ పనే బాగుందని, ఎప్పుడూ ఎవరో ఒక సెలెబ్రిటీతో ఉంటున్నాడని కామెంట్లు వస్తున్నాయి. మళ్లీ సాధన,ప్రీతమ్, సమంతలు కలిసి కనిపిస్తారా? లేదా? అన్నది చూడాలి.

 Also Read:  Dasara Collection : దసరా ఊచకోత.. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్?.. నాని దెబ్బకు బాక్సాఫీస్ బద్దల్

Also Read: Janhvi Kapoor Pics : అందాలను ఒడిసిపట్టినట్టుగా.. కాక పుట్టించేలా జాన్వీ కపూర్ లుక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News