Anasuya Vimanam : అనసూయ కొత్త సినిమా ప్రమోషన్స్ షురూ.. 'విమానం' టేక్ ఆఫ్ అయిందిగా

Anasuya Bharadwaj in Vimanam అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. చిన్న పాత్ర, పెద్ద పాత్ర అన్న తేడా లేకుండా సినిమాలను చేస్తూనే వెళ్తోంది. ఇక సముద్రఖని సైతం తెలుగులో ఫుల్ బిజీగా మారిపోయాడు. విలన్‌గా, దర్శకుడిగా తెలుగులో హంగామా చేస్తున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 08:42 PM IST
  • విమానం సినిమాతో మీరా జాస్మిన్ రీ ఎంట్రీ
  • సముద్రఖని కొత్త సినిమాతో ప్రయోగం
  • విమానంలో అనసూయ ముఖ్య పాత్ర
Anasuya Vimanam : అనసూయ కొత్త సినిమా ప్రమోషన్స్ షురూ.. 'విమానం' టేక్ ఆఫ్ అయిందిగా

Anasuya Bharadwaj in Vimanam సముద్రఖని, అనసూయ, మీరా జాస్మిన్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా విమానం. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఆడియెన్స్‌ను అల‌రింంచేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా కోసం సముద్రఖని దివ్యాంగుడిలా కనిపించబోతోన్నాడు.

అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే మ‌ధ్య వ‌య‌స్కుడిగా, భార్య లేక‌పోయినా పిల్లాడిని  జాగ్ర‌త్త‌గా చూసుకునే వీర‌య్య అనే తండ్రి పాత్ర‌లో సముద్రఖని కనిపించబోతోన్నాడు. ఈ సినిమాను జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News