Ranbir Kapoor: సందీప్ రెడ్డి వంగా సినిమా వస్తోంది అంటే సినీ ప్రేక్షకులు ఒక ఇంటెన్షియల్ సినిమా రాబోతోంది అని తెగ ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఇప్పటికి తీసింది రెండు సినిమాలే అయినా.. ఆ రెండు సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో అర్జున్ రెడ్డి.. హిందీలో కబీర్ సింగ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి ప్రస్తుతం యానిమల్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.
రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యనే విడుదలై సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. అర్జున్ రెడ్డి కి మించిపోయేలా ఉన్నాడు ఈ యనిమల్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రంపై ఆసక్తి నెలకొన్న దానికి ముందు నుంచి కారణమైంది ఈ చిత్ర టైటిల్. సందీప్ రెడ్డి ఈ సినిమా టైటిల్ యనిమల్ అనగానే…ప్రేక్షకులు ఈ చిత్రంలో హీరో ఏ విధంగా ఉంటారో అని అంచనాలు పెంచేసుకున్నారు. అర్జున్ రెడ్డి అని సినిమా పేరు పెట్టి.. అందులో హీరోని నిజంగానే యనిమల్ తీరులో చూపించారు సందీప్ రెడ్డి. ఇక ఇప్పుడు సినిమా పేరే ఏకంగా యానిమల్ అని పెట్టడంతో ఈ చిత్రంలో హీరో.. ఏ రేంజ్ అగ్రెసివ్ గా ఉంటారు అని అందరూ తెగ ఎదురుచూశారు. కాగా అసలు ఈ చిత్రానికి ఈ పేరు ఎందుకు పెట్టాడో ఫైనల్ గా చెప్పుకొచ్చారు సందీప్ రెడ్డి వంగ.
మనము ఎదిగే క్రమంలో మనకు చదువు, తెలివితేటలు వచ్చాయి కాబట్టి మనిషి అని పేరు పెట్టుకున్నామని.. కానీ నిజానికి మనిషి ఒక సోషల్ యానిమల్ అని తన స్టైల్ వేదాంతాలు చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. మనుషులకు ఐక్యూ ఉంది కాబట్టి కమ్యూనికేషన్ పెరుగుతూ ఫుడ్ చెయిన్‌లో మొదటిగా ఉంటూ వస్త్రాలు వేసుకోవడం మొదలు పెట్టామని.. అదే కానీ మనుషులకు ఐక్యూ అనేది లేకపోతే మనుషులు కూడా యానిమలే కదా అనేది తన వ్యక్తిగత భావన అని చెప్పుకొచ్చాడు ఈ డైరెక్టర్. అంతేకాదు తనకు చిన్నప్పుడు సోషల్ సబ్జెక్ట్ చదివిన దగ్గర నుంచి ఈ విషయం తన మైండ్లో రన్ అవుతూ ఉండేదని క్లారిటీ ఇచ్చాడు. ‘నేను ఆలోచించింది ఏంటంటే.. యానిమల్‌కు ఐక్యూ ఉండదు. తన ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటారు. యానిమల్ సినిమాలో హీరో పాత్ర కూడా ప్రవృత్తితో వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రకు యానిమల్ అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అని ఈ సినిమాకి ఈ పేరు పెట్టాను’’ అని చెప్పుకొచ్చాడు సందీప్ రెడ్డి.
Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు
Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
యానిమల్ పేరు వెనక అసలు కథ.. ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టిన దర్శకుడు..