Spirit: రీమేక్స్ వద్దు.. ఒరిజినల్ కథ ముద్దు.. ప్రభాస్ కి సలహా ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

Spirit Update: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో నేషనల్ వైడ్ పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో చేస్తున్నారు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 8, 2024, 07:04 PM IST
Spirit: రీమేక్స్ వద్దు.. ఒరిజినల్ కథ ముద్దు.. ప్రభాస్ కి సలహా ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు సందీప్ రెడ్డి వంగా. ఆ తరువాత తెలుగులో ఏ సినిమా చేయకుండా హిందీలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్ గా తీసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఆ తరువాత రణబీర్ కపూర్ తో తీసిన యానిమల్ చిత్రం మరో సెన్సేషన్ గా నిలిచింది. ఈ సినిమాకి ఎన్నో ప్రశంసలతో పాటు ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించిన ఈ సినిమా అవార్డులు కూడా ఎక్కువగానే దక్కించుకుంది.

ఈ క్రమంలో ప్రస్తుతం ఈ దర్శకుడి తదుపరి ప్రాజెక్టు పైన ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సందీప్ రెడ్డి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో ప్రకటించారు. త్వరలోనే సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఈ డైరెక్టర్.

యానిమల్ సినిమా కన్నా ముందే ప్రభాస్ సందీప్ రెడ్డిని పిలిచి చాన్స్ ఇచ్చారట. గత కొద్ది రోజుల క్రితం సందీప్ రెడ్డిని ప్రభాస్ పిలిచి ఒక బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీని తెలుగులో రీమేక్ చేద్దామని అడిగారట. కానీ అందుకు ఈ దర్శకుడు ఒప్పుకోలేదట. మనకి రీమేక్స్ ఎందుకు, ఒరిజినల్ కథతో సినిమా చేద్దాము అని సందీప్ రెడ్డి ప్రభాస్ కి చెప్పారట. ఒక మంచి ఐడియా వస్తే మీకు చెబుతానని ప్రామిస్ కూడా చేశారట. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత సందీప్ రెడ్డికి ఒక మంచి కథ  మైండ్ లో రావడంతో.. వెంటనే ప్రభాస్ దగ్గరికి వెళ్లి అది వినిపించారట. ప్రభాస్ కి అది బాగా నచ్చేసి.. ఆ సినిమాకి ఓకే చెప్పడంతో.. దానికే స్పిరిట్ అని పేరు పెట్టారట.

ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో బయటపెట్టారు సందీప్ రెడ్డి. కాకా ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు చెబుతూ ఈ సినిమాలో ప్రభాస్ నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలియజేశారు. ఇక ఈ రోల్.. సందీప్ గత సినిమాల్లో హీరో పాత్రలు మాదిరి హార్డ్ హిట్టింగ్ గానే ఉంటుందని చెప్పుకొస్తున్నారు. కాగా ప్రభాస్ ఎన్నో మాస్ సినిమాలు చేసిన బోల్డ్ సినిమాలు చేసింది మాత్రం తక్కువే. ఈ క్రమంలో సందీప్ రెడ్డి స్టైల్లో ప్రభాస్ ఎలా నటిస్తారు అని ఎంతోమందిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికి 60 శాతం స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసినట్లు సందీప్ వంగ తెలియజేశారు. ఇక ఈ మూవీకి దాదాపు 300 కోట్ల బడ్జెట్ ని పెడుతున్నట్లు వెల్లడించారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాలి.

Also Read: KCR Arrest: కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ఇదేనా?

Also Read: Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..

 

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News