Saripodhaa Sanivaaram: తెలుగులో సరిపోయింది..కానీ వేరే భాషల్లో..?

Saripodhaa Sanivaaram Collections: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా వచ్చిన.. చిత్రం సరిపోదా శనివారం. యాక్షన్  థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా తెలుగులో కలెక్షన్స్.. బాగానే రాబట్టినా, మిగతా భాషా ఇండస్ట్రీలలో డిజాస్టర్ గా నిల్వదానికి పరుగులు తీస్తోంది. తెలుగులో సరిపోయింది కానీ.. వేరే భాషల్లో ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులకు సరిపోలేదు.. అనడంలో సందేహం లేదు.  

Written by - Vishnupriya | Last Updated : Aug 30, 2024, 07:02 PM IST
Saripodhaa Sanivaaram: తెలుగులో సరిపోయింది..కానీ వేరే భాషల్లో..?

Saripodhaa Sanivaaram collections other than Telugu States: నేచురల్ స్టార్ నాని హీరోగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్  థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా.. గురువారం రిలీజ్ అయ్యి తెలుగులో పాజిటివ్ టాక్ .. మిగతా భాషల్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. నిజానికి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే.. మెప్పించిందని, కలెక్షన్స్ చూస్తే అర్థమవుతోంది. 

Add Zee News as a Preferred Source

తెలుగులో విజయం సాధించినప్పటికీ.. ఈ సినిమా కథ రొటీన్ గానే ఉంది అంటూ తెలుగు ప్రేక్షకులు సైతం కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా నాని పర్ఫామెన్స్ ఎప్పటిలాగే అనిపించింది అని.. బిజిఎం, యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపించుకున్నా, నాని ఇంకాస్త కొత్తగా ట్రై చేసి ఉంటే బాగుండేది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో విలన్ గా నటించిన ఎస్ జె సూర్య తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. కాగా…తెలుగు సినిమా కాబట్టి నానికి ఒకరకంగా ఈ సినిమా ప్లస్ అయింది. కాని వేరే భాషల్లో మాత్రం ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. 

ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే .. ఇతర భాషల్లో ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పించింది అనే విషయం అర్థమవుతుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజు రూ.38 కోట్ల గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిందని సమాచారం. ఇకపోతే విడుదలైన మొదటి రోజు ఓవరాల్ గా రూ .9 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొదటిరోజు వచ్చిన రూ .9కోట్లల్లో.. నిజానికి కేవలం తెలుగులోనే రూ .8.75 కోట్లు రాబట్టగా, తమిళ్ రూ.55 లక్షలు,  మలయాళం లో రూ. 5 లక్షలు మాత్రమే వసూలు చేసింది.  మిగతా భాషా ఇండస్ట్రీలలో రూ .20 లక్షలు రాబట్టింది. అయితే హిందీలో  జీరో.. దీన్ని బట్టి.. అసలు ఈ సినిమా టికెట్ బుకింగ్ కూడా ఇక్కడ ఓపెన్ కాలేదు అని చెప్పవచ్చు.  ఇక కర్ణాటక విషయానికి వస్తే.. రూ .1.1 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.  ఇండియా వైడ్ గా 10.4 కోట్లు రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 19.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం పైన.. సరిపోదా శనివారం సినిమా ఓవరాల్ గా 53.54% ఆకు పెన్సిల్ థియేటర్లు రన్ అయ్యాయి. 

దీన్ని బట్టి చూస్తే మిగతా ఇండస్ట్రీలలో ఈ సినిమా చెత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్కుందని అర్థమయిపోతుంది. అయితే తెలుగులోనే కాదు మిగతా భాషా ప్రేక్షకులను.. కూడా మెప్పించినప్పుడే నానికి పాన్ ఇండియా మార్కెట్ రాగలుగుతుంది. అది ఎంత ప్రయత్నించినా నాని ప్రస్తుతం సొంతం చేసుకోలేకున్నారు. మరి ఇకనైనా నాని సినిమా కథల ఎంపికలో.. తన నటన వైవిధ్యంలో..మరిని జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి.

Read more: CM Revanth Reddy: భారత న్యాయవ్యవస్థ మీద అపార నమ్మకం ఉంది.. ఎక్స్ లో తీవ్ర విచారం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News