Vimala raman: త్వరలో పెళ్లికి సిద్ధమైన సీనియర్ హీరోయిన్.. వరుడు ఎవరంటే!

Vimala Raman: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విమల రామన్ త్వరలో వినయ్ రాయ్ తో ఏడడుగులు వేయబోతోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 21, 2024, 10:00 PM IST
Vimala raman: త్వరలో పెళ్లికి సిద్ధమైన సీనియర్ హీరోయిన్.. వరుడు ఎవరంటే!

Vimala Raman..ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు వయసుతో సంబంధం లేకుండా పెళ్లికి సిద్ధమవుతున్నారు.. ఈ క్రమంలోనే టాలీవుడ్,  బాలీవుడ్, కోలీవుడ్,  మాలీవుడ్ తో సహా చాలామంది సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకుంటున్నారు.. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు,  క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమకు నచ్చిన వారితో ఏడడుగులు వేస్తున్నారు ..ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా.. ఆల్రెడీ వివాహమై.. పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధమయి.. అందరినీ ఆశ్చర్యపరిచింది.. దాదాపు 10 సంవత్సరాలపాటు అతనితో ప్రేమాయణం నడిపిన ఈమె ఇప్పుడు అతడిని వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది. అంతేకాదు పలువురు సెలబ్రిటీలను కూడా ఆమె ఆహ్వానించింది. 

ఇక ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ పెళ్లికి సిద్ధమయింది.. ఆమె ఎవరో కాదు విమలా రామన్.. త్వరలో నటుడు వినయ్ రాయ్ తో.. ఏడడుగులు వేయబోతోంది. ఎప్పటి నుంచో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని... చాలా రోజులగా వార్తలు వస్తున్నాయి.కానీ ఈ విషయంపై ఎవరు స్పందించలేదు..  గత నెలలో తమ లవ్ విషయాన్ని ఇండైరెక్టుగా ధ్రువీకరించింది ఈ జంట.. పెళ్లయిన వాళ్లు దిగేలాగా ఫోటోషూట్ చేసి తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్నారు.. మరొకవైపు విమలా రామన్ కూడా నెట్టింట వరుసగా వినయ్ రాయ్ తో దిగిన ఫోటోలను ఆమె షేర్ చేస్తూ వస్తోంది..ఫోటోలే కాదు వీడియోస్ కూడా పంచుకుంటుంది. దీంతో మరికొద్ది రోజుల్లో వీరు వివాహం చేసుకోబోతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.మరి కొంతమంది వీరింకా లివింగ్ రిలేషన్ లో ఉన్నారు.. అందుకే పెళ్లికి సంబంధించిన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. ఏది ఏమైనా సీనియర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె త్వరలోనే  పెళ్లికి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. 

ఇక విమలా రామన్ కెరియర్ విషయానికి వస్తే.. ఎవరైనా ఎప్పుడైనా అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అంతకుముందు బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది.  ఆ తర్వాత తెలుగులో.. గాయం -2,  చుక్కలాంటి అబ్బాయి చక్కనైన అమ్మాయి వంటి చిత్రాలు చేసినా.. ఈమెకు హీరోయిన్గా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత రుద్రాంగి , గాండీవదారి అర్జున వంటి చిత్రాలలో కీలకపాత్రలు పోషించింది.. ఈ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని అందించలేదు.. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గాండీవదారి అర్జున సినిమాలో విమల రామన్ కు భర్తగా వినయ్ నటించారు.. ఇప్పుడు వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు.. త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు.

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News