Pathaan Telugu Trailer పఠాన్ సినిమా వచ్చిన వివాదాలు అందరికీ తెలిసిందే. దీపిక కాషాయ రంగు బికినీలో కనిపించడం, భేషరమ్ రంగ్ అంటూ పాటను రిలీజ్ చేయడంపై ఓ వర్గం పఠాన్ సినిమా మీద నిషేదం విధించింది. అయితే పఠాన్ ట్రైలర్ చూస్తే.. ఇదొక దేశభక్తి సినిమా అని, సైనికుడి వీరోచిత ధైర్యాల మీద, దేశం కోసం సైనికుడు ప్రాణాలు సైతం లెక్కచేయడని చెప్పే సినిమాలా ఉంది. చివర్లో జై హింద్ అని చెబుతూ ట్రైలర్‌ను ముగించారు. ఇవన్నీ చూసి అయినా పఠాన్ మీద వివాదాలు తగ్గుతాయో లేదో చూడాలి. మొత్తానికి ట్రైలర్ మాత్రం అదిరిపోయినట్టు కనిపిస్తోంది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా వార్ సినిమా స్థాయిని మించేలా ఉన్నాయి. సిద్దార్థ్ ఆనంద్ మరోసారి తన మ్యాజిక్ చూపించబోతోన్నాడనిపిస్తోంది.
అవుట్ ఫిక్స్ ఎక్స్ అనే టెర్రర్ సంస్థ.. కాంట్రాక్ట్ కోసం పని చేస్తుందట.. ఆ సంస్థ ఇండియా మీద పెద్ద ఎత్తున అటాక్ ప్లాన్ చేయడం, దాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం పఠాన్‌ను రంగంలో దించుతుందట. ఇలా స్టార్ట్ అయిన ట్రైలర్.. పఠాన్ ఎంట్రీతో అదిరిపోయింది. యాక్షన్ సీక్వెన్స్ నిజంగా వేరే లెవెల్లో ఉన్నాయి. దీపిక పదుకొణె చేసిన స్టంట్స్ కూడా కళ్లుబైర్లు కమ్మేలా ఉన్నాయి. రొమాంటిక్ సీన్లు, యాక్షన్ సీన్లు అనే తేడా లేకుండా దీపిక రెచ్చిపోయింది.
ఇక జాన్ అబ్రహం ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా కనిపిస్తున్నాడు. మరి దేశం మీద జరిగే అటాక్స్‌ను పఠాన్ ఎలా అడ్డుకున్నాడు.. అసలు ఈ అటాక్స్ చేయిస్తోంది ఎవరు? అసలీ పఠాన్ ఎవరు? ఎందుకు దూరంగా ఉన్నాడు.. మళ్లీ మిషన్ కోసం ఎందుకు పిలిచారు? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తేలా ఈ ట్రైలర్ ఉంది. పఠాన్ సినిమాతో షారుఖ్ కోరుకున్న విజయం మాత్రం లభించేలా ఉంది. వార్ సినిమాను సిద్దార్థ్ ఆనంద్ ఎలా అయితే ఆసక్తికరంగా మలిచాడో.. ఎన్ని ట్విస్టులతో అందరినీ మెస్మరైజ్ చేశాడో.. ఈ పఠాన్ సినిమాతోనూ అలానే మెప్పించబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా జనవరి 25న దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Also Read: Shaakuntalam Trailer.. శాకుంతలం ట్రైలర్.. మెస్మరైజ్ చేసిన సమంత.. అల్లు అర్హ ఎంట్రీ అదుర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి