Siddharth: సీఎం గురించి నిన్న అలా.. ఈరోజు ఇలా.. సినిమా కోసం ప్లేట్ మార్చిన సిద్ధార్థ?

Siddharth Bharateeyudu 2: తాజాగా హైదరాబాద్ లో ..జరిగిన ఇండియన్ 2 ప్రెస్ మీట్ లో నటుడు సిద్ధార్థ్..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కౌంటర్ వేశారు అని అందరూ కామెంట్లు పెట్టారు. కానీ తాజాగా సిద్ధార్థ్.. ఒక వీడియో చేసి విడుదల చేశారు. తన పూర్తి మద్దతు సీఎం రేవంత్ రెడ్డికి.. ఉంది అని.. క్లారిటీ ఇచ్చారు.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 9, 2024, 09:41 AM IST
Siddharth: సీఎం గురించి నిన్న అలా.. ఈరోజు ఇలా.. సినిమా కోసం ప్లేట్ మార్చిన సిద్ధార్థ?

Siddharth about CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈమధ్యనే బయట సినిమా షూటింగ్, టిక్కెట్ల ధరల పెంపు వంటి విషయాల.. గురించి పర్మిషన్ కావాలి అంటే..ఆ సినిమాకి సంబంధించిన నటులు మాదకద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ క్రైమ్ లాంటి సామాజిక ఇబ్బందులపై అవగాహన కల్పించే వీడియోలు.. తయారు చేయాలి అని షరతు పెట్టిన సంగతి తెలిసిందే. 

అయితే, ఈ విషయం గురించి భారతీయుడు 2 ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. సిద్ధార్థ్ నటులు అందరికీ సామాజిక బాధ్యత ఉంటుంది అని, ఇలాంటి ఆదేశాలు అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. దాంతో సిద్ధార్థ్ రేవంత్ రెడ్డికి కౌంటర్ వేశారు.. అని అందరూ అనుకున్నారు. తాజాగా పరిస్థితి అర్థం చేసుకున్న… సిద్ధార్థ్ మళ్ళీ ప్లేట్ మార్చేసి తన మద్దతు రేవంత్ రెడ్డి కి అని క్లారిటీ ఇచ్చారు. 

"భారతీయుడు 2 సినిమా అవినీతి.. గురించి జీరో టాలరెన్స్, డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ గురించి. ప్రెస్ మీట్ సమయంలో నా మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకే నేను ఆ విషయాన్ని.. వెంటనే క్లియర్ చేయాలి.. అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు.. మన చేతుల్లోనే ఉంది. వారి భవిష్యత్తును కాపాడుకోవడం మన కర్తవ్యం. ఒక మంచి సమాజం కోసం చిత్ర పరిశ్రమను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ఈ విషయంలో నేను 100 శాతం రేవంత్ గారికి సపోర్ట్ చేస్తాను. ఇప్పటి వరకు నేను చాలా సామాజిక కార్యక్రమాలకు మద్దతుగా.. ఉన్నాను. ప్రభుత్వం నుండి మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు అని మాత్రమే నా మాటల అర్థం. డ్రగ్స్, సైబర్ నేరాలపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి నా అభినందనలు మేము మీతోనే ఉన్నాం సర్" అని చెబుతూ సిద్ధార్థ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ విడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. 

 

ఇక భారతీయుడు 2 గురించి చెప్పాలంటే, శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1996 లో విడుదలైన భారతీయుడు చిత్రానికి సీక్వెల్. ఈ సినిమాలో కమల్ సేనాపతి.. అనే పాత్రలో మళ్లీ కనిపిస్తారు. దేశంలో అవినీతిని తగ్గించడానికి పోరాడే ఒక వ్యక్తి గా కమల్ హాసన్ సినిమాలో కనిపిస్తారు. భారతీయుడు 2 లో సిద్ధార్థ్ సరసన రకుల్ నటిస్తూ ఉండగా, ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 12న విడుదల కాబోతోంది.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..

Read more:Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News