SIIMA Awards 2024 Winners: సెప్టెంబర్ 14, 15 తేదిల్లో సైమా అవార్డుల కార్యక్రమం ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఫస్ట్ డే తెలుగు, కన్నడ భాషలకు సంబంధించి 2023లో విడుదలైన చిత్రాలకు పురస్కారాలు అందజేసారు. ఈ వేడుకకు దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. శ్రేయ, నేహా శెట్టి, ఫరియా అబ్దుల్లా తమ గ్లామర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసారు.
2023లో తెలుగులో విడుదలైన చిత్రాలకు SIIMA Awards 2024 పేరిట అందజేసారు. ఇందులో ఉత్తమ చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీలీల ముఖ్యపాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా నిలిచింది. దసరా సినిమాలోని నటనకు గాను ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తి సురేశ్ లు అవార్డులు గెలుచుకున్నారు. అటు కన్నడ నుంచి ‘సప్తసాగరదాచ ఎల్లో - ఎ’ సినిమాలోని యాక్టింగ్ కు గాను బెస్ట్ యాక్టర్ గా రక్షిత్ శెట్టి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. బెస్ట్ యాక్ట్రెస్ గా రుక్మిణి వసంత్ నిలిచారు.
2024 సంవత్సరానికి గానూ ‘దసరా’ (Dasara Movie) మూవీలో నటనకు ఉత్తమ నటుడిగా నాని (Nani), ఉత్తమ నటిగా కీర్తి సురేశ్ (Keerthy suresh) అవార్డును అందుకున్నారు. పలు విభాగాల్లో దసరా మూవీ సత్తా చాటింది. ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth kesari) నిలిచింది. ఇక కన్నడ చిత్రాలకు కూడా ఈ సందర్భంగా అవార్డులు అందించారు. ‘సప్తసాగరదాచె ఎల్లో-ఎ’లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా రక్షిత్‌శెట్టి, నటిగా రుక్మిణీ వసంత్ అవార్డులు అందుకున్నారు.
‘సైమా’ 2024 అవార్డుల విన్నర్స్ లిస్ట్ ..
ఉత్తమ చిత్రం.. భగవంత్ కేసరి
ఉత్తమ నటుడు.. నాని (దసరా)
ఉత్తమ నటి.. కీర్తి సురేశ్ (దసరా)
ఉత్తమ దర్శకుడు.. శ్రీకాంత్ ఓదెల (దసరా)
ఉత్తమ పరిచయ నటుడు.. సంగీత్ శోభన్ (మ్యాడ్)
ఉత్తమ పరిచయ నటి.. వైష్ణవి చైతన్య(బేబి)
ఉత్తమ పరిచయం దర్శకుడు.. శౌర్యువ్ (హాయ్ నాన్న)
ఉత్తమ పరిచయ నిర్మాత.. వైరా ఎంటర్టైన్మెంట్స్ (హాయ్ నాన్న)
బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్).. ఆనంద్ దేవరకొండ (బేబి)
బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్)..మృణాల్ ఠాకూర్ (హాయ్ నాన్న)
బెస్ట్ డైరెక్టర్ (క్రిటిక్స్).. సాయి రాజేష్ (బేబి)
ఉత్తమ సహాయ నటుడు.. దీక్షిత్ శెట్టి (దసరా)
ఉత్తమ సహాయ నటి.. బేబి ఖియారా ఖాన్ (హాయ్ నాన్న)
ఉత్తమ హాస్య నటుడు.. విష్ణు (మ్యాడ్)
ఉత్తమ సంగీత దర్శకుడు.. అబ్దుల్ వాహబ్ (ఖుషీ, హాయ్ నాన్న)
ఉత్తమ సినిమాటోగ్రఫీ.. భువన గౌడ (సలార్)
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్.. రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు - బలగం) నిలిచారు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.