Ester Noronha as Adult star: అడల్ట్ ఫిలిం స్టార్‌గా బిగ్ బాస్ ఫేమ్ నోయెల్ ఎక్స్ వైఫ్

సునీల్ నటించిన భీమవరం బుల్లోడు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఈస్టర్ నోరోన్హా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈస్టర్ నొరోన్హా ఎవరో తెలుసు కదా.. ప్రముఖ సింగర్, బిగ్ బాస్ ఫేమ్ నోయెల్ సీన్ మాజీ భార్యనే ఈస్టర్ నోరోన్హా.

Last Updated : Jan 14, 2021, 06:29 PM IST
Ester Noronha as Adult star: అడల్ట్ ఫిలిం స్టార్‌గా బిగ్ బాస్ ఫేమ్ నోయెల్ ఎక్స్ వైఫ్

సునీల్ నటించిన భీమవరం బుల్లోడు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఈస్టర్ నోరోన్హా చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈస్టర్ నొరోన్హా ఎవరో తెలుసు కదా.. ప్రముఖ సింగర్, బిగ్ బాస్ ఫేమ్ నోయెల్ సీన్ మాజీ భార్యనే ఈస్టర్ నోరోన్హా. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ ఆ తర్వాత పరస్పర అభిప్రాయ బేధాలతో డైవర్స్ తీసుకున్నారు. 

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే నోయెల్‌కి డైవర్స్ ఇచ్చినప్పుడు వార్తల్లోకెక్కిన ఈస్టర్ ఆ తర్వాత మళ్లీ ఈ రీ ఎంట్రీతో వార్తల్లో నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈస్టర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో రొటీన్ సినిమాను కాకుండా ఓ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌ను సెలెక్ట్ చేసుకుంది.

Also read : Raai Laxmi: ఐటం గాళ్ లక్ష్మీరాయ్‌కి కరోనా పాజిటివ్

హీరోయిన్ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఈస్టర్ ఓ పోర్న్ స్టార్‌గా ( Actress Ester Noronha as Adult film star ) నటించనుంది. తిరుపతి ఎస్ఆర్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. హీరోయిన్ మూవీ స్క్రిప్ట్ ప్రకారం ఈస్టర్ ( Ester Noronha ) చాలా బోల్డ్ అవతార్‌లో కనిపించనుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News