Sunitha : లవ్ బ్రేకప్‌కి ఒక పార్టీ.. కొత్త లవర్ దొరికితే మరో పార్టీ..సింగర్ సునీత వ్యాఖ్యలు

Singer Sunitha: తనకు అనిపించింది మాట్లాడటంలో సింగర్ సునీత ఎప్పుడూ ముందుంటారు. అయితే పెద్దగా ఇంటర్వ్యూస్ లో కనపడని ఈ సింగర్ ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం.. తడ పడకుండా జవాబులు ఇస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అలానే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సునీత చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 18, 2023, 08:28 PM IST
Sunitha : లవ్ బ్రేకప్‌కి ఒక పార్టీ.. కొత్త లవర్ దొరికితే మరో పార్టీ..సింగర్ సునీత వ్యాఖ్యలు

Sunitha on break-up: గులాబీ సినిమాలోని ‘ఈ వేళలో నీవు..’ పాటతో అందరినీ ఆకట్టుకున్న సింగర్ సునీత. ఆ తరువాత ఎన్నో మెలోడియస్ సాంగ్స్ పాడి.. తెలుగువారి మదిలో చిత్ర తరువాత అంతటి పేరు తెచ్చుకునింది.

సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తనదైన స్టైల్ చూపిస్తూ ఆకట్టుకుంది సునీత. ఏ సినిమాలో అయినా హీరోయిన్ సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తోంది అంతే.. ఆ హీరోయిన్స్ కి తప్పక సునీతనే డబ్బింగ్ ఇచ్చుంటది అనేంతలా పేరు తెచ్చుకుంది. 

సినిమాల్లో సూపర్ సక్సెస్ సాధించిన ఈమె పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొంది. తన మొదటి పెళ్లి ఫెయిల్ కావడంతో..2021 లో మ్యాంగో మీడియా గ్రూప్ ఓనర్ రామ్ వీరపనేనిని పెళ్లాడారు.

కాగా ఈ మధ్య మీడియాతో ముచ్చటించిన ఈ సింగర్. ప్రస్తుత జనరేషన్ బ్రేకప్స్ గురించి.. ప్రేమ.. పెళ్లిళ్లు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుత జనరేషన్ వారి గురించి మాట్లాడుతూ ఈమధ్య కాలంలో ప్రేమ, పెళ్లి విషయంలో ఎన్నో బ్రేకప్ లు అవుతున్నాయని.. లవ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నారని తెలియజేశారు. అంతేకాదు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కుంటే తప్ప చిన్న చిన్న విషయాల్లో బ్రేకప్ చెప్పుకోవడం తనకు అసలు అర్థం కావట్లేదు అని కామెంట్ చేసారు. 

ఇక ప్రస్తుత జనరేషన్ లైఫ్ స్టైల్ గురించి చెబుతూ..లవ్ బ్రేకప్‌కి ఒక పార్టీ.. కొత్త లవర్ దొరికితే మరో పార్టీ ఇచ్చుకుంటూ రిలేషన్స్ నుంచి ఈజీగా బయటకు వచ్చేయడం చూస్తుంటే తనకు ఆశ్చర్యం వేస్తోంది అని చెప్పుకొచ్చారు. ఇక అలవాట్లు చెడ్డవి అయినంత మాత్రాన ఆ వ్యక్తి చెడ్డవారు అని డిఫైన్ చేయలేమని చెప్పారు.

కాగా ఇప్పుడు ఎంతోమంది డ్రెస్సింగ్ గురించి కామెంట్లు చేస్తున్నారని ..అసలు డ్రెస్సింగ్ విషయం ప్రస్తావిస్తూ  డ్రెస్సింగ్‌ను బట్టి అవతలి వ్యక్తి మంచి వారా? చెడ్డవారా? అనేది జడ్జ్ చేయలేమన్నారు సునీత. 
ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News