పెళ్లి కథనాలపై స్పందించిన సింగర్ సునీత

పెళ్లి పుకార్లపై స్వయంగా స్పందించిన సింగర్ సునీత

Last Updated : Jul 21, 2018, 04:27 PM IST
పెళ్లి కథనాలపై స్పందించిన సింగర్ సునీత

ప్రముఖ నేపథ్యగాయని సునీత మళ్లీ పెళ్లి చేసుకుంటోందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో ఓ టీవీ ప్రోగ్రాం ప్రొడ్యూసర్‌ని పెళ్లి చేసుకున్న సునీత ఆ తర్వాత అతడితో విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. ఈ ఇద్దరికీ ఓ పాప, బాబు కూడా ఉన్నారు. అయితే, ఇటీవల సునీత రెండో పెళ్లికి రెడీ అయ్యిందనే ప్రచారం ఊపందుకుంది. ఓ ఐటీ కంపెనీ యజమానిని పెళ్లి చేసుకుంటోందని ఓసారి, మరో ప్రముఖ సింగర్‌తో పెళ్లికి సిద్ధమైందని మరోసారి రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయమై తాజాగా సింగర్ సునీత స్పందించారు.

 

తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై ఫేస్‌బుక్ వేదికగా స్పందించిన సింగర్ సునీత.. ఒకరి వ్యక్తిగత జీవితాలపై మరొకరికి ఎందుకంత ఆసక్తి అని ఆవేదన వ్యక్తంచేశారు. పెళ్లి చేసుకుంటున్నారా లేదా అనే సంగతిని ప్రస్తావించకుండా.. మరొకరి వ్యక్తిగత వ్యవహారాల్లో కలుగజేసుకోవడం సరైంది కాదని అన్నారామె. తాను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడితే సంతోషంగా ఉంటుందని ఆశిస్తూ సందేశాలు పంపించిన శ్రేయోభిలాషులు అందరికీ చాలా కృతజ్ఞతలు అని అంతే అందంగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. తనకు ఫిలింఫేర్ అవార్డ్స్, నంది అవార్డ్ వచ్చినప్పుడు కూడా ఇంత స్పందన కనిపించలేదు అని చెబుతూ.. తన పెళ్లి గురించి చెప్పాల్సి వస్తే, తానే చెబుతాను కానీ మధ్యలో వాళ్లు చెప్పే పుకార్లను నమ్మొద్దని అభిమానులకు సూచించారామె. అంతేకదా.. ఎవరి పర్సనల్ లైఫ్ వారిది మరి!

Trending News