Liger Movie Day 4 Collections Report World Wide : లైగర్ సినిమాలో పూరి జగన్నాథ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత భారీ డిజాస్టర్ టాక్ అందుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 25వ తేదీన విడుదలైన ఈ సినిమాకు మొదటి ఆట నుంచి కూడా నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది.
ఈ నేపద్యంలో మొదటి రోజు కలెక్షన్లు బాగానే ఉన్నా రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు దారుణమైన కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా. మొదటి రోజు 9 కోట్ల 57 లక్షలు వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండో రోజు మాత్రం కోటి 54 లక్షలు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక మూడో రోజు కేవలం కోటి రూపాయల వసూళ్లు మాత్రమే సాధించిన ఈ సినిమా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో 58 లక్షల వసూళ్లకు మాత్రమే పరిమితమైంది.
ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం మీద నాలుగు రోజులలో 12 కోట్ల 69 లక్షల షేర్, 21 కోట్ల యాభై లక్షల గ్రాస్ సాధిస్తే కర్ణాటక సహా మిగతా ప్రాంతాల్లో తెలుగు వర్షన్ కు గాను కోటి 45 లక్షల సాధించింది. మిగతా భాషల్లో 75 లక్షలు సాధించిన ఈ సినిమా నార్త్ ఇండియాలో ఇప్పటివరకు 6 కోట్ల 25 లక్షల షేర్ సాధించింది. అంతేకాక ఈ లైగర్ సినిమా ఓవర్సీస్ లో మూడు కోట్ల 30 లక్షల షేర్ సాధించింది. ఈ సినిమాకి ఓవరాల్ గా బిజినెస్ 88 కోట్ల 40 లక్షలకు జరగడంతో 90 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నిర్ణయించారు.
ఈ సినిమాకి ఇప్పుడు వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే ఇంకా 66 కోట్ల 56 లక్షలు వసూలు చేస్తే కానీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మొత్తం రాబట్టడం గగనం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే సినిమాని ప్రమోట్ చేసేందుకు విజయ్ దేవరకొండ ఏకంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో అంటే దుబాయ్ లో ప్రత్యక్షం కావడం ఆసక్తికరంగా మారింది. ఎలా అయినా నార్త్ లో ఈ సినిమాను ప్రమోట్ చేసుకోవాలని విజయ్ దేవరకొండ అండ్ టీమ్ చూస్తోంది.
నోట్: ఈ కలెక్షన్స్ వివరాలు, వివిధ మార్గాల ద్వారా మేము సేకరించిన సమాచారం మాత్రమే. జీ తెలుగు న్యూస్, ఈ కలెక్షన్స్ ను ధృవీకరించడం లేదు.
Also Read: Liger Movie Offer: సొంత ఊళ్లో పూరీకి షాక్.. లైగర్ మూవీ టికెట్లపై 3+1 ఆఫర్
Also Read: Manoj Desai Sorry to Vijay: మొన్న అనకొండ అన్న నోటితోనే సారీ చెప్పించుకున్న విజయ్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి