Sita Ramam Mrunal Thakur : దూసుకుపోతోన్న సీతారామం బ్యూటీ.. సౌత్‌లో పాగా వేసినట్టే!

Sita Ramam Mrunal Thakur సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా టాలీవుడ్‌ను తన వైపునకు తిప్పుకుంది. సీత పాత్రలో మృణాల్ కనిపించిన, నటించిన తీరు చూసి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తమ ఇంటి పిల్లగా మృణాల్‌ను చూసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 03:32 PM IST
  • నెట్టింట్లో సీతారామం బ్యూటీకి క్రేజ్
  • దక్షిణాదిపై మృణాళ్ ఠాకూర్‌ ఫోకస్
  • సౌత్‌లోనే ఇంటిని కూడా కొనేసిందా?
Sita Ramam Mrunal Thakur : దూసుకుపోతోన్న సీతారామం బ్యూటీ.. సౌత్‌లో పాగా వేసినట్టే!

Mrunal Thakur Upcoming Movies సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్‌ల జోడి తెరపై మ్యాజిక్ చేసింది. రామ్ పాత్రలో దుల్కర్, సీత పాత్రలో మృణాళ్ ఇద్దరూ న్యాయం చేశారు. ఈ ఇద్దరి నటన వల్లే ఈ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చింది. చివరకు సీతారామం సినిమా ఓ క్లాసిక్‌గా నిలిచింది. దర్శకుడిగా హను రాఘవపూడి స్థాయిని ఎంతో పెంచేసింది. అలా సీతారామం సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది.

సీతారామం సినిమాతో అందరినీ మెప్పించిన మృణాళ్ ఇప్పుడు టోటల్ సౌత్ మీద ఫోకస్ పెట్టేసింది. తమిళ, మళయాలం సినిమాలను సైతం చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆల్రెడీ తెలుగులో నానితో ఓ సినిమాను ఓకే చేసింది. ఇప్పుడు సూర్యతోనూ ఓ సినిమాను కమిట్ అవ్వబోతోందనే వార్త వచ్చింది. ఇక మాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.

అసలు మృణాళ్ ఇక్కడే ఓ ఇంటిని కూడా కొనేసిందనే టాక్ ఎక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. వీటన్నంటికి ఓ కారణం ఉంది. ఆమె దక్షిణాదిలోని ప్రముఖ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అయిన బెంచ్‌మార్క్ టాలెంట్స్‌తో టై అప్ అయినట్టుగా చెప్పడమే. దీంతో ఆమె సౌత్‌లోనే ఎక్కువగా ఫోకస్ పెట్టేయాలని ఫిక్స్ అయినట్టు అర్థం అవుతోంది.

అయితే మృణాళ్ ఠాకూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ములేపేస్తోంది. మృణాల్ పాత ఫోటోలన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఆమె బోల్డ్‌గా కనిపించే ఫోటోలు, కురచ దుస్తుల్లో కనిపించిన నాటి ఫోటోలను జనాలు ఎక్కువగా వెతుకున్నారు.

ఆమె సీరియల్స్ చేసినప్పుడు, మోడలింగ్ చేసిన సమయంలో దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీతారామం సినిమాలో ఎంతో హోమ్లీగా చూసిన వారంతా.. మోడ్రన్ దుస్తుల్లో మృణాళ్‌ని చూసి షాక్ అవుతుంటారు. హిందీ సీరియల్స్ చేసి బాలీవుడ్ తెరపై హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాళ్ ఇప్పుడు సౌత్‌లోనూ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తోంది.

Also Read:  Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్

Also Read: Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్‌ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News