Super Star Krishna Death : కృష్ణ మరణం.. నాడు నేడు.. మహేష్‌, చైతూ, ఎన్టీఆర్ పిక్ వైరల్

Jr NTR Naga Chaitany Mahesh Babu pic కృష్ణకు నివాళి అర్పించేందుకు జూ. ఎన్టీఆర్, నాగ చైతన్య వచ్చారు. అనంతరం మహేష్‌ బాబును ఓదార్చేందుకు చైతూ, ఎన్టీఆర్ పక్కపక్కనే కూర్చున్నారు. వీరు కూర్చున్న విధానం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2022, 10:41 AM IST
  • సూపర్ స్టార్ కృష్ణ మరణం
  • నివాళులు అర్పించిన ఎన్టీఆర్, చైతూ
  • నాడు నేడు అంటూ పిక్ వైరల్
Super Star Krishna Death : కృష్ణ మరణం.. నాడు నేడు.. మహేష్‌, చైతూ, ఎన్టీఆర్ పిక్ వైరల్

Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల దేశ ప్రధాని నుంచి సీఎంల వరకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక సినీ ప్రముఖులంతా కూడా కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. నిన్న అంతా కూడా నానక్‌రాంగూడలో ఆయన భౌతిక కాయానికి సెలెబ్రిటీలు, అభిమానులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఇక నిన్న కృష్ణకు చిరంజీవి, మోహన్ బాబు, సురేష్‌ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్‌, నాగ చైతన్య ఇలా అందరూ కూడా నివాళులు అర్పించారు. మహేష్‌ బాబును ఓదార్చారు.

అయితే మహేష్‌ బాబు నాగ చైతన్య ఎన్టీఆర్ పక్కపక్కనే కూర్చోవడంతో నాటి ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఘట్టమనేని, నందమూరి, అక్కినేని వారసులు ఇలా ఒకే చోట కనిపించారు. ఇలాంటి ఓ అరుదైన ఫోటో గతంలోనూ ఒకటి ఉంది. ఘట్టమనేని కృష్ణ, నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ఉన్న వరుస క్రమంలోనే ఇప్పుడు మహేష్‌ బాబు, నాగ చైతన్య, ఎన్టీఆర్ కూడా కూర్చున్నారు.

తండ్రి, తాతలు ఆ ఫోటోలో ఉంటే..ఇప్పుడు వారి వారసులు ఇందులో ఉన్నారు. దీంతో ఈ ఫోటోను మూడు ఫ్యామిలీల వారసులు నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. ఇదొక అరుదైన చిత్రమని అభిమానులు సంబరపడిపోతోన్నారు. కానీ ఇలాంటి సమయంలో ఇలా ఒకటిగా చేరడం మాత్రం బాధాకరమని అంటున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయం అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియో ఉంచారు.

నిన్న సీఎం కేసీఆర్ నివాళి అర్పిస్తే.. నేడు సీఎం జగన్ నివాళి అర్పించేందుకు వస్తున్నారు. నేటి సాయంత్రం మహాప్రస్థానంలో కృష్ణ అంతిమయాత్ర నిర్వహించనున్నారు. ఈ ఏడాదిలోనే ఘట్టమనేని ఇంట్లో ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. జనవరిలో రమేష్‌ బాబు, సెప్టెంబర్‌లో ఇందిరాదేవి, ఇక ఇప్పుడు కృష్ణ మరణించారు. మహేష్‌ బాబుకు మాత్రం ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ కష్టాలు, బాధల్లోంచి మహేష్‌ బాబు బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read : Samantha Yashoda overseas Collections : సమంత స్టామినా ఇదే.. అక్కినేని వారు అందుకోలేనంత ఎత్తులో

Also Read : Siri-Shrihan : శ్రీహాన్ లవర్‌ను ఎత్తుకున్న మానస్.. బిగ్ బాస్ బ్యూటీ సిరి పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News