Pan World Movie: ఆ కొత్త చిత్రంలో ప్రభాస్ సరసన...దక్షిణ కొరియా భామ

Pan World Movie: బాహుబలితో దేశమంతా ప్రాచుర్యం పొందిన ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. పాన్ ఇండియా మూవీలతో బిజీగా ఉన్న ప్రభాస్ తదుపరి చిత్రంలో నటించనున్న హీరోయిన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్ (Tollywood)నుంచి బాలీవుడ్‌కు ఎదిగిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించాడు. బాహుబలి 2 తరువాత వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందుకే మకాం కూడా ముంబైకు మార్చాడు. ఒప్పుకున్న ఒక్కొక్క పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా మారాడు. ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు గానీ 25వ చిత్రం ఒప్పేసుకున్నాడు. సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ 25వ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి స్పిరిట్ అని పేరు కూడా ఖరారైంది. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ యాక్షన్ నేపధ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో పాన్‌వరల్డ్ స్థాయి చిత్రంగా నిలవనుంది. 

ఈ నేపధ్యంలో బాలీవుడ్‌లో(Bollywood) ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. పాన్‌వరల్డ్ స్థాయి చిత్రంలో ప్రభాస్(Prabhas) సరసన నటించే హీరోయిన్ విషయం ఇది. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో పాటు జతకట్టనున్న హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న సౌత్ కొరియన్ భామ సాంగ్ హైక్యోని(Song Hyekyo) ఎంపిక చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ విలన్ పాత్ర పోషించనుంది.

Also read: Chalo Premiddam Teaser: ఛలో ప్రేమిద్దాం టీజర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

English Title: 
South Korean actress song hye kyo to appear with prabhas in his next movie spirit
News Source: 
Home Title: 

Pan World Movie: ఆ కొత్త చిత్రంలో ప్రభాస్ సరసన...దక్షిణ కొరియా భామ

Pan World Movie: ఆ కొత్త చిత్రంలో ప్రభాస్ సరసన...దక్షిణ కొరియా భామ
Caption: 
South Korean ( file photo)
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Pan World Movie: ఆ కొత్త చిత్రంలో ప్రభాస్ సరసన...దక్షిణ కొరియా భామ
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Thursday, November 11, 2021 - 08:08
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
115
Is Breaking News: 
No