Sreeleela: హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలీల.. సైలెంట్ గా జరిగిపోయిన షూటింగ్

Sreeleela Next Movie: ప్రస్తుతం శ్రీలీల కెరియర్ కొంచెం ఒడిదుడుకుల్లో ఉంది. కానీ అభిమానుల్లో ఆమెకు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో ఇప్పుడు శ్రీలీల కి సంబంధించిన కొన్ని ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 7, 2024, 05:06 PM IST
Sreeleela: హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలీల.. సైలెంట్ గా జరిగిపోయిన షూటింగ్

Sreeleela-Hanu Raghavapudi:
శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్. ఆ తరువాత రవితేజతో వచ్చిన ధమాకా చిత్రంతో మంచి విజయం అందుకుంది. ఆ సినిమా కమర్షియల్ గా ఎంత విజయం సాధించిందో పక్కన పెడితే.. ఆ సినిమా విజయం వెనక ప్రధాన కారణం శ్రీలీలనే అంటూ.. అప్పట్లో అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్ట సాగారు. శ్రీలీల డాన్స్ కి ఆ చిత్రంలో అందరూ ఫిదా అయిపోయారు.

ఇక ఆ చిత్రంతో శ్రీలీల కెరియర్ మారిపోయింది.‌ ఒకేసారి దాదాపు 9 సినిమా ఆఫర్లు అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ తొమ్మిది సినిమాలలో.. కేవలం ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే విజయం సాధించడం గమనర్హం. మరో విషయం ఏమిటి అంటే..బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి చిత్రం మాత్రమే.. ఈ తొమ్మిది సినిమాలలో.. శ్రీలీల కి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలో మాత్రమే ఈ హీరోయిన్ కి ప్రాధాన్యత గల పాత్ర దొరికింది.

ఇక ఈ బాలకృష్ణ చిత్రం మినహా.. మిగతా చిత్రాలు అన్నీ కూడా శ్రీలీలని కేవలం పాటలకు పరిమితం చేశాయి. ముఖ్యంగా వైష్ణవ తేజ్ తో చేసిన ఆదికేశవ చిత్రం శ్రీ లీల కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలింది. ఇక మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకున్న.. ఈ హీరోయిన్ కి మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు.

ఈ క్రమంలో ప్రస్తుతం శ్రీ లీల ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. తాజాగా శ్రీ లీల సోషల్ మీడియాలో ఒక షూటింగ్ గురించి ఫోటోలు షేర్ చేయగా.. అవి ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఆ షూటింగ్ ఫోటోల కింద.. దర్శకుడు హను రాఘవ పూడికి థాంక్స్ కూడా చెప్పింది ఈ హీరోయిన్. ఇక ఈ షూటింగ్ ఫోటోలో పల్లెటూరు అమ్మాయిల కనిపిస్తూ.. ఒక్కో ఫోటోలో ఒక్కో ఎమోషన్ పండించింది. కాగా హను రాఘవపూడి ఈ మధ్యనే సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మరి శ్రీలీల, హను రాఘవపూడి.. ఎవరికీ చెప్పకుండా షూటింగ్ జరిపేసి.. ఆ ఫోటోలు విడుదల చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇదేదో సినిమా షూటింగ్ అనుకుంటే మాత్రం.. మీరు పప్పులో కాలేసినట్టే.. ఇది కేవలం ఒక యాడ్ షూటింగ్ మాత్రమే. ఇక ఇదే విషయాన్ని తన పోస్ట్ కింద పెట్టింది ఈ హీరోయిన్.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeleela (@sreeleela14)

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

Read more: Viral Video: కొంప ముంచిన సెల్ఫీ సరదా.. వైరల్ గా మారిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

 

Trending News