Bigg Boss Satya : కుక్క తోక వంకర అన్నట్టుగా ఉంది.. బుద్ది మార్చుకోని శ్రీ సత్య.. నాగ్ చెప్పినా అంతేనా?

Sri Satya imitates keerthi శ్రీ సత్యకు ఈ మధ్య వెటకారం ఎక్కువ అవుతోన్నట్టుగా కనిపిస్తోంది. ఫైమాతో ఉండటం వల్లో ఏమో గానీ సత్య కూడా అతికి అంబాసిడర్‌గా మారుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 15, 2022, 04:44 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో సత్య ఓవర్ యాక్షన్
  • వెటకారంలో మించిపోతోన్న సత్య, ఫైమా
  • బుద్ది మార్చుకోని శ్రీ సత్య
Bigg Boss Satya : కుక్క తోక వంకర అన్నట్టుగా ఉంది.. బుద్ది మార్చుకోని శ్రీ సత్య.. నాగ్ చెప్పినా అంతేనా?

Sri Satya imitates keerthi : బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు పదకొండో వారం నడుస్తోంది. ఇంట్లో ఇప్పుడు పది మంది కంటెస్టెంట్లున్నారు. ఈ టాప్ 10 కంటెస్టెంట్లలో ఎవరు విన్ అవుతారన్నది పక్కన పడితే.. ఏ ఒక్క కంటెస్టెంట్‌కి విన్నింగ్ అర్హత పూర్తిగా లేదనిపిస్తుంది. రేవంత్ అన్ని విధాల అర్హుడని అనుకునే సమయంలోనే తన నోటి దురుసు, కోపంతో ఉన్నదంతా చెడగొట్టేసుకుంటాడు. శ్రీహాన్ నిర్ణయాల్లో నిజాయితీ అనిపించదు. ఆదిరెడ్డి ఇన్ని రోజులు గీతక్కా అంటూ తిరగడం వల్ల తన ముద్ర వేసుకోలేకపోయాడు.

ఫైమా, శ్రీ సత్యలు అయితే వెటకారంతో ఉన్న ఇమేజ్ అంతా పోగొట్టుకుంటున్నారు. శ్రీ సత్య అయితే మరీ ముఖ్యంగా అర్జున్ విషయంలో చేసిన చేష్టలు, ఇప్పుడు శ్రీహాన్‌తో చేస్తోన్న చేష్టల మధ్య తేడా ఆమెను మరీ పాతాళానికి పడేస్తోంది. జనాలు అర్జున్ కళ్యాణ్‌ను సత్య ఎలా చూసింది.. ఎలా చీదరించుకుంది.. దూరంగా పెట్టింది.. శ్రీహాన్‌తో ఎలా ఉంటోంది అనే విషయాలను కూడా గమనిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News