Ester Noronha starrer Recce Web Series motion poster Out: జీ5 కేవలం ఓటీటీ ప్లాట్‌ఫారమ్ మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ. కంటెంట్ పరంగా ఎల్లప్పుడూ అత్యుత్తమంగా ఉంటుంది. జీ5 కంటెంట్ పరంగా చూస్తే.. ఎన్నో మిలియన్ల మంది హృదయాల ఆదరణతో ముందుకు దూసుకుపోతుంది. జీ5 ఒక జోనర్‌కు మాత్రమే పరిమితం కాకుండా.. సినిమా, వెబ్ సిరీస్ ఇలా అన్ని రకాల జోనర్స్‌ను వీక్షకులకు అందించనుంది. ఇటీవలే జీ5 లో వచ్చిన వెబ్ సిరీస్ 'గాలివాన' భారీ హిట్ అయ్యింది. మళ్లీ ఇప్పుడు వీక్షకులను ఏంటర్‌టైన్ చేసేందుకు జీ5 కొత్త వెబ్ సిరీస్‌ను తీసుకొస్తోంది.
'రెక్కీ' అనే వెబ్ సీరిస్‌తో జీ5 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మూడు దశాబ్దాల క్రితం (1990) రాయలసీమలోని తాడిపత్రిలో జరిగిన ఓ హత్యను ఆధారంగా చేసుకుని ఈ వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య, ఆపై జరిగిన పరిణామాల ఆధారంగా కథ నడుస్తుంది. పోలూరి కృష్ణ తీసిన ఈ వెబ్ సీరిస్‌లో ఏడు ఎపిసోడ్స్ (ప్రతిదీ ఇరవై ఐదు నిమిషాల నిడివి) ఉన్నాయి. రెక్కీ జూన్ 17న జీ 5లో స్ట్రీమింగ్ కాకానున్న నేపథ్యంలో ఈరోజు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంది.
'రెక్కీ' వెబ్ సీరిస్‌లో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ లెనిన్‌గా హీరో శ్రీరామ్ నటిస్తున్నాడు. శివ బాలాజీ, ధన్యా బాలకృష్ణ, ఆడుకాలం నరేన్, ఎస్తర్ నొరోన్హా, జీవా, శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్, రామరాజు, సమ్మెట గాంధీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. '1990లలో తాడిపత్రిలో జరిగిన రెండు హత్యలకు సంబంధించిన మిస్టరీని ఛేదించే బాధ్యతను సబ్ ఇన్‌స్పెక్టర్ లెనిన్‌కు ఇస్తారు. ఇవి రాజకీయ హత్యలా? లేక ఫ్యాక్షన్ హత్యలా? అనేది దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించాడు' అని నిర్మాత శ్రీరామ్ కొలిశెట్టి తెలిపారు.
'శ్రీరామ్, శివ బాలాజీ ఇంతవరకూ చేయని పాత్రలు ఇందులో చేశారు. సీరీస్‌లోని ప్రధాన భాగాలను అనంతపురంలో చిత్రీకరించారు. దర్శకుడు మరియు ఇతర సాంకేతిక నిపుణులు ఈ సిరీస్ కథను ఓన్ చేసుకొని ప్రేక్షకులకు వాస్తవికమైన సంఘటనలను వివరించడం జరిగింది. గ్రామీణ ఫ్యాక్షన్ క్రైమ్ డ్రామాతో వస్తున్న ఇలాంటి కథను ప్రేక్షకులు చూసి చాలా కాలం అయ్యింది. కాబట్టి వీక్షకులకు ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా నచ్చుతుంది' అని నిర్మాత పేర్కొన్నారు.
Also Read: Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్ ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలుసా?
Also Read: అతడికి బౌలింగ్ చేయడం చాలా కష్టం.. అదృష్టవశాత్తు ఇద్దరం ఒకే జట్టులో ఉన్నాం: రషీద్ ఖాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Reiki Web Series: ZEE5 నుంచి మరో కొత్త వెబ్ సిరీస్.. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్! తాడిపత్రి హత్య ఆధారంగా
ZEE5 నుంచి మరో కొత్త వెబ్ సిరీస్
జూన్ 17 నుంచి స్ట్రీమింగ్
తాడిపత్రి హత్య ఆధారంగా