Balakrishna: స్టార్ హీరోని అందరి ముందర బూతులు తిట్టిన బాలకృష్ణ.. వీడియో వైరల్

Balakrishna controversy: బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో పైకి ఎంత వైలెంట్ గా కనిపిస్తారు.. లోపల అంత సైలెంట్ మనిషి అని ఎంతో మంది చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పైకి మాత్రమే కోపంగా కనిపించే ఈ మనిషి.‌ లోపల మాత్రం మంచు అంటూ ఎంతో మంది బతికే ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు.

Written by - Vishnupriya | Last Updated : Nov 7, 2024, 10:40 AM IST
Balakrishna: స్టార్ హీరోని అందరి ముందర బూతులు తిట్టిన బాలకృష్ణ.. వీడియో వైరల్

Balakrishna fires on Rana: బాలకృష్ణ పైకి ఎంత గడుసుగా కనిపించిన.. లోపల మాత్రం మనిషి లాంటి వ్యక్తి అంటూ ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఎప్పుడన్నా చిరాకు వస్తే ఒక మాట అన్నా కానీ.. మనిషికి అవసరం అన్నప్పుడు ఎప్పుడు బాలకృష్ణ ముందుంటారు అనే కామెంట్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి బాలకృష్ణ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. 

Add Zee News as a Preferred Source

అసలు విషయానికి వస్తే ఈ మధ్యనే అబుదాబిలో.. అంగరంగ వైభవంగా ఐఫా 2024 అవార్డ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల మహోత్సవం జరిగి ఎన్నో రోజులు కావస్తుండగా.. ఇప్పుడు ఈ అవార్డుల ఫంక్షన్ నుంచి ఒక్కొక్క వీడియో బయటకి వచ్చు ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులో భాగంగా యాంకర్ రానా చేసిన అల్లరి.. ప్రధానంగా హైలైట్ అవుతోంది. 

ఈ క్రమంలో ముఖ్యంగా రానాని బాలకృష్ణ తిట్టే వీడియో ఒకటి తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు విషయానికి వస్తే రానా.. నాకు ఎంతో ఫేవరెట్ అన్ స్టాపబుల్ పోస్ట్ అయిన బాలయ్య బాబుకి ఫోన్ చేస్తాను అంటూ బాలకృష్ణకి ఫోన్ చేస్తారు.. ఇక బాలయ్య ఎత్తగానే.. బాలయ్య అబుదాబి వచ్చారంట.. నాతో ఐఫా షో చేస్తారా అనగా.. దానికి సమాధానం గా బాలకృష్ణ..’ ఎవడ్రా ఎర్రి *క ఎవడ్రా నువ్వు,’ అంటారు. అప్పుడు వెంటనే రానా నేను రానాని అనగా.. అది చెప్పురా గాడిద అని సమాధానం ఇచ్చారు బాలయ్య. 

ఇక ఎందుకు సంబంధించిన వీడియోనే తమాషాగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంతమంది బాలయ్య ఎప్పుడు ఇంతే అని ఆయన్ని విమర్శలు చేయగా.. అది కామెడీ వీడియో అంతేకాకుండా బాలయ్య తన సొంత వాళ్లతో అలానే మాట్లాడతారు అని మరికొంతమంది.. వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా బాలయ్య కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటుంది.

 

Also Read: బొప్పాయి ఫేస్‌మాస్క్‌తో బోలెడు ప్రయోజనాలు.. హిరోయిన్‌ మించిన అందం మీ సొంతం..

Also Read:  ఈ 3 ఇంటి చిట్కాలతోనే తెల్ల వెంట్రుకల సమస్యకు ఈజీగా చెక్‌ పెట్టొచ్చు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News