Stunt Man Died: సినిమా షూటింగ్‌లో అపశృతి.. స్టంట్‌మ్యాన్ మృతి.. నోరు విప్పని హీరో, దర్శకుడు, నిర్మాత

Stunt Man Died in viduthalai Shooting: సురేష్ ట్రైన్ బోగీలపై నుంచి పరుగెడుతూ బ్రిడ్జిపైకి దూకి పరుగెత్తాల్సి ఉంది. ఈ సన్నివేశాన్ని తెరకెక్కించే క్రమంలోనే క్రేన్‌కి కట్టిన తాడు తెగి సురేష్ కిందపడి తుది శ్వాస విడిచాడు. సురేష్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Written by - Pavan | Last Updated : Dec 5, 2022, 08:06 PM IST
  • కోలీవుడ్ సినిమా షూటింగ్‌లో ఊహించని అపశృతి
  • ఫైటింగ్ సన్నివేశంలో 20 అడుగుల ఎత్తులో ఉండగా తెగిన తాడు
  • స్టంట్‌మ్యాన్ మృతిపై అధికారిక ప్రకటనకు దూరంగా ఉన్న మూవీ యూనిట్
Stunt Man Died: సినిమా షూటింగ్‌లో అపశృతి.. స్టంట్‌మ్యాన్ మృతి.. నోరు విప్పని హీరో, దర్శకుడు, నిర్మాత

Stunt Man Died in viduthalai Shooting: సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తుగా ఓ స్టంట్ మ్యాన్ 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విదుతళై సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఎస్ సురేష్ అనే 54 ఏళ్ల స్టంట్ మ్యాన్ ఓ స్టంట్ చేయాల్సి వచ్చింది. తాడు నడుముకు కట్టుకుని 20 అడుగుల ఎత్తు నుంచి దూకే సన్నివేశంలో సురేష్ గాల్లో ఉండగానే తాడు తెగిపోయింది. తాడు సహాయంతో సురక్షితంగా కింద ల్యాండ్ కావాల్సిన సురేష్ తాడు తెగిపోవడంతో కిందపడి గాయాలపాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన సురేష్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. సురేష్ ని చిత్ర యూనిట్ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. సురేష్ ని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు.

సినిమా షూటింగ్‌లో స్టంట్‌మ్యాన్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. సురేష్ ట్రైన్ బోగీలపై నుంచి పరుగెడుతూ బ్రిడ్జిపైకి దూకి పరుగెత్తాల్సి ఉంది. ఈ సన్నివేశాన్ని తెరకెక్కించే క్రమంలోనే క్రేన్‌కి కట్టిన తాడు తెగి సురేష్ కిందపడి తుది శ్వాస విడిచాడు. సురేష్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

సినిమా షూటింగ్‌లోనే సురేష్ మృతి చెందినప్పటికీ.. చిత్ర దర్శకుడు వెట్రిమారన్ కానీ లేదా ప్రధాన పాత్రలు పోషిస్తున్న విజయ్ సేతుపతి, సూరిలో ఎవ్వరూ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. స్టంట్ మ్యాన్ మృతి అసోసియేషన్ లో లేనిపోని వివాదాలకు తెరతీస్తుందనే భయంతోనే వాళ్లు అధికారిక ప్రకటనకు దూరంగా ఉన్నట్టు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 

2020లో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న భారతీయుడు 2 చిత్రం షూటింగ్ సమయంలోనూ భారీ క్రేన్ కూలి మీద పడటంతో ముగ్గురు టెక్నీషియన్స్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన కారణంగా చిత్రం షూటింగ్ రెండేళ్లపాటు ఆగిపోయి మళ్లీ ఇటీవలే తిరిగి పట్టాలెక్కింది. ఈ ఘటనలో మృతి చెందిన ముగ్గురు టెక్నిషియన్స్ కుటుంబాలకు దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్, చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ చెరో 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించాయి. 

ఇదిలావుంటే, ఇలాంటి ఊహించని ప్రమాదాలు జరిగిన సమయంలో స్టంట్స్‌మెన్ కుటుంబాలు నష్టపోకుండా ఉండటం కోసం వారికి ముందుగానే ఇన్సూరెన్స్ చేయించే పద్ధతిని గతంలోనే అక్షయ్ కుమార్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ( Akshay Kumar ) ప్రారంభించిన ఆ ఇన్సూరెన్స్ పద్ధతిని సినీపరిశ్రమ వర్గాలు మరోసారి గుర్తుచేసుకుంటున్నాయి. అలా ఇన్సూరెన్స్ చేయిస్తే ఇలాంటి ఊహించని ఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబాలకు భరోసా ఉంటుందని కొంతమంది స్టంట్స్‌మేన్ చెప్పుకుంటున్నారు.

Also Read : Adivi Sesh Lady Fan: మొన్న డేటన్నది, ఇప్పుడు డిలీట్ చేయమంటోంది..వారి కంట పడితే అంతే అంటున్న శేష్ ఫ్యాన్!

Also Read : Jabardasth Satya Sri : నా కంట్లోంచి నీళ్లు వస్తున్నాయ్.. జబర్దస్త్ సత్య ఎమోషనల్

Also Read : #NTRforSDT : మెగా హీరో సినిమాను ప్రమోట్ చేస్తున్న జూ.ఎన్టీఆర్.. ఆయన కోసమేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x