Sukumar - Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఇక కోలుకుంటాడా?.. పక్కన పెట్టేసిన సుకుమార్

Sukumar - Vijay Devarakonda సుకుమార్ సినిమాలపై ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. విజయ్ దేవరకొండతో ఒక సినిమా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ ప్రాజెక్ట్ ఉండేట్టు కనిపించడం లేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2022, 03:51 PM IST
  • సుకుమార్ విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్‌పై చర్చలు
  • విజయ్ దేవరకొండతో క్యాన్సిల్ చేసిన సుకుమార్
  • రామ్ చరణ్‌తోనే చేసేందుకు రెడీ అయిన సుక్కు
Sukumar - Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఇక కోలుకుంటాడా?.. పక్కన పెట్టేసిన సుకుమార్

Sukumar - Vijay Devarakonda : ఇండస్ట్రీలో ఒక్క హిట్ అంతా మారుస్తుంది. ఫ్లాప్ మొత్తం తలకిందులు చేస్తుంది. బ్యాక్ గ్రౌండ్, వారసత్వం, స్టార్ హీరోలకు కొంత మినహాయింపు ఉంటుంది. వరుసగా ఫ్లాపులు పడ్డా కూడా ఒక్క హిట్ కొడితే అన్ని లెక్కలు సెట్ అవుతాయి. అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ అలాంటి స్థితిలోనే ఉన్నాడు. స్టార్ కిడ్ కాదు పెద్ద నేపథ్యం ఏమీ లేదు. అయినా స్టార్ హీరో రేంజ్‌కు వెళ్లాడు. ప్యాన్ ఇండియా ప్రయత్నాలు బెడిసి కొట్టేశాయి. హిట్ కొట్టి చాలా కాలమే అయింది.

వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్, లైగర్ ఇలా అన్నీ దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. వీటన్నంటిలోకెల్లా లైగర్ వల్ల అయిన డ్యామేజ్ ఎక్కువ. లైగర్ ప్రమోషన్స్‌లో విజయ్ చేసిన అతి, మాట్లాడిన మాటలు కోటలు దాటడం, సినిమాను అమితంగా పొగడటం, కలెక్షన్ల విషయంలో చేసిన కామెంట్లు అన్నీ కూడా డ్యామేజ్ చేశాయి.

ఇవన్నీ పక్కన పెడితే పూరి విజయ్ రిలేషన్ కూడా దెబ్బతింది. జన గణ మన సినిమా కూడా అటెకెక్కేసింది. శివ నిర్వాణతో చేస్తోన్న సినిమా సమంత అనారోగ్యం వల్ల ఆగిపోయింది. అది ఎప్పుడూ మళ్లీ మొదలవుతుందో కూడా చెప్పలేం. ఇక ఇవన్నీ ఇలా ఉంటే.. విజయ్ చేతిలో ఒక్క సినిమా లేకపోవడం, షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఖాళీగాఉండే పరిస్థితి వచ్చింది.

గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇక బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. విజయ్ ఇలా ప్రయత్నాలు చేస్తుంటే తాజాగా ఓ షాకింగ్ రూమర్ బయటకు వచ్చింది. విజయ్‌తో చేయాల్సిన సినిమాను  సుకుమార్ పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. దాదాపు స్టార్ హీరోలతోనే సుకుమార్ సినిమా చేయాలని చూస్తున్నాడట. పుష్ప పార్ట్ 2  తరువాత రామ్ చరణ్‌తో సినిమా తీస్తాడట. అలా విజయ్ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసినట్టు సమాచారం. మరి వీటి నుంచి విజయ్ బయట పడతాడా? ఓ హిట్ కొడతాడా? ఫ్లాపుల పరంపర నుంచి కోలుకుంటాడా? అన్నది చూడాలి.

Also Read : Baladitya Marina Elimination : బిగ్ బాస్ షాకింగ్ ఎలిమినేషన్.. ఇద్దరు కంటెస్టెంట్లు అవుట్  

Also Read : Jambalakidi jaaru Mitaya : జంబలకిడి జారు మిఠాయా.. నవ్వులు పూయించిన అషూ.. వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News