Supreme Court Notices to Gautamiputra Satakarni and Rudramadevi Makers: నందమూరి హీరో బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలయింది. నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో చేశారు. గౌతమీపుత్ర శాతకర్ణి అనే టైటిల్ తో 2017 సంవత్సరంలో సినిమా విడుదల చేశారు. ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద వై రాజీవ్ రెడ్డి జాగర్లమూడి సాయిబాబా సంయుక్తంగా నిర్మించారు.
రెండవ శతాబ్దానికి సంబంధించిన శాతవాహన సామ్రాజ్యాధినేత గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించగా హేమమాలిని నందమూరి బాలకృష్ణ తల్లి పాత్రలో నటించారు. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాకు వినోద పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సినిమా యూనిట్ కోరింది. దీంతో అప్పట్లో ఈ సినిమాకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపు ఇచ్చారు.
\అయితే పన్ను మినహాయింపు ఇచ్చినా సరే సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదని చెబుతూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. సినిమా యూనిట్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పన్ను రాయితీ తీసుకున్నప్పటికీ దాని ప్రతిఫలం మాత్రం ప్రేక్షకులకు దక్కేలా చేయలేదని యధావిధిగా టికెట్ రేట్లు అమ్మకాలు జరిపారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పన్ను రాయితీ పొందిన డబ్బులన్నీ కూడా సినిమా యూనిట్ నుంచి రికవరీ చేయాల్సిందిగా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇక ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. విచారణలో భాగంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అలాగే సినిమా నిర్మాతలు అయిన రాజీవ్ రెడ్డి, సాయిబాబా ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన సమయంలో విడుదలైన గుణశేఖర్ రుద్రమదేవి సినిమాకి ఏపీలో పన్ను రాయితీ లభించలేదని అప్పట్లో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పలు ఆరోపణలు గుర్తించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధినేత చంద్రబాబు బాలకృష్ణకు బావ అవుతారన్న కారణంతోనే తమ సొంత సినిమాకు పన్ను రాయితీ ప్రకటించారని అప్పట్లో గుణశేఖర్ ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు రుద్రమదేవి నిర్మాత గుణశేఖర్ సహా తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇదే అంశంలో నోటీసులు జారీ చేశారు.
Also Read: Poonam Kaur on Jesus Christ: జీసస్ పై పూనం సంచలనం.. ఎప్పుడు పుట్టాడు? ఎవరికి పుట్టాడు అంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి