Sushant Singh Rajput's Sister Comments: వ్యభిచారి అంటూ ఘాటు వ్యాఖ్యలు.. ఆమెను కాదంటూ సుశాంత్ సోదరి క్లారిటీ

Sushant Singh Rajput's Sister Prostitute Tweet on Rhea Chakraborty: సుశాంత్ సింగ్ సోదరి ప్రియాంక సింగ్ సంచలన ఆరోపణలు చేసింది, వ్యభిచారి అంటూ కామెంట్లు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 11, 2023, 11:59 PM IST
Sushant Singh Rajput's Sister Comments: వ్యభిచారి అంటూ ఘాటు వ్యాఖ్యలు.. ఆమెను కాదంటూ సుశాంత్ సోదరి క్లారిటీ

Sushant Singh Rajput's Sister Prostitute Tweet Goes Viral: అనుమానాస్పద స్థితిలో మరణించిన బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మిస్టరీ ఇప్పటికీ తేల లేదు. ఆయన ఎలా చనిపోయాడు? అనే విషయం మీద అనేక రకాల వాదనలు ఉన్నాయి గాని నిజానికి ఎలా చనిపోయాడు? అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. ఇక తాజాగా ఇదే విషయం మీద ఆయన సోదరి ప్రియాంక సింగ్ సంచలన ఆరోపణలు చేసింది.

నిజానికి ఆమె ఎవరి పేరు ఉద్దేశించి మాట్లాడలేదు కానీ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు మాత్రం సుశాంత్ సింగ్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఉద్దేశించినవే అనే కామెంట్స్ వినిపించాయి. నిజానికి ప్రియాంక సింగ్ తన ట్వీట్ లో మీరు ఎందుకు భయపడతారు? మీరు వేశ్య వృత్తిలో ఉన్నారు ఎప్పటికీ అందులోనే కొనసాగుతారు మీకు మద్దతు ఇస్తున్న రాజకీయ నాయకులు చూసి నీకు అంత ధైర్యం అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

ఇది కూడా చదవండి: YSRCP Viral Video: 'మా నమ్మకం నువ్వే జగన్‌' స్టిక్కర్ చింపి పట్టుకుపోయిన కుక్క..కేసులు పెడతారేమో?

అందులో ఎవరి పేరు ఆవిడ మెన్షన్ చేయలేదు కానీ రియా చక్రవర్తి తాను కొన్ని సినిమాలలో నటిస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఇలాంటి ట్వీట్ రావడంతో ఆమెను ఉద్దేశించే ప్రియాంక సింగ్ పోస్ట్ పెట్టి ఉండవచ్చని అందరూ భావించారు. అయితే మీడియాలో కూడా ఇవే కథనాలు వస్తూ ఉండడంతో ప్రియాంక సింగ్ ఇదే విషయం మీద క్లారిటీ ఇచ్చింది. ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నానని చెబుతూ సదర ట్వీట్ ను మెన్షన్ చేసి నేను దీన్ని ఏ ఒక్క వ్యక్తిని గురించి మాట్లాడలేదు, మీడియాలో ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడినట్లు రిపోర్ట్లు వస్తున్నాయి.

కానీ దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను నా కోపాన్ని వ్యవస్థలో కొనసాగుతున్న తీరుని విమర్శించా తప్ప ఇక్కడ ఏ ఒక్క వ్యక్తిని నేను మెన్షన్ చేయడం లేదని పేర్కొంది. సోమవారం నాడే రియా చక్రవర్తి రోడీస్ 19 షో లో నటిస్తున్నట్లుగా ప్రకటించింది. పోయిన వారు ఎలాగో తిరిగిరారు, కానీ ఇప్పుడు ఎవరి కోసం భయపడాలి? అలా భయపడేవారు వేరేలా ఉంటారంటూ రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలకు కౌంటర్ గానే ప్రియాంక సింగ్ ఈ మేరకు కామెంట్ చేసి ఉండవచ్చని అంటున్నారు.

ఇది కూడా చదవండి: Chandra Grahan 2023: బుద్దపౌర్ణిమ రోజే చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారికి బంపర్ ఆఫర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News