Sushmita Sen: ప్రియుడితో బ్రేకప్.. సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్! పార్టీలు చేసుకుంటూ..!!

మొన్నటివరకు ఎక్కడికి పోయినా రోహ్మాన్ షాల్‌తో కనిపించే సుస్మితా సేన్ ప్రస్తుతం ఒంటరిగానే కనబడుతున్నారు. బ్రేకప్ అనంతరం స్నేహితులతో కలిసి సుస్మితా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 11:23 AM IST
  • సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్
  • ప్రియుడితో సుస్మితా సేన్ బ్రేకప్
  • పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సుస్మితా సేన్
 Sushmita Sen: ప్రియుడితో బ్రేకప్.. సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరోయిన్! పార్టీలు చేసుకుంటూ..!!

Sushmita Sen posted a picture of herself after announcing Break-Up With Rohman Shawl: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ (Sushmita Sen) తన ప్రియుడి రోహ్మాన్ షాల్‌ (Rohman Shawl)తో విడిపోయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2018లో రోహ్మన్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు అధికారికంగా ప్రకటించిన సుస్మిత.. తాజాగా తన మూడేళ్ల బంధంకు గుడ్ బై (Sushmita Sen Break-Up) చెప్పారు. మేము ఫ్రెండ్స్‌గా పరిచయం అయ్యాం, ఫ్రెండ్స్‌లానే ఉండిపోతున్నాం, మా బంధం ఎప్పుడో తెగిపోయింది అని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ప్రియుడి లవ్‌‌కి బ్రేకప్ చెప్పిన సుస్మితా సేన్ ప్రస్తుతం సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. 

మొన్నటివరకు ఎక్కడికి పోయినా రోహ్మాన్ షాల్‌తో కనిపించే సుస్మితా సేన్ ప్రస్తుతం ఒంటరిగానే కనబడుతున్నారు. జిమ్‌లో కష్టపడుతూ, కొత్త ప్రదేశాలను తిరుగుతూ సింగల్ లైఫ్ మొదలెట్టారు. మరోవైపు బ్రేకప్ అనంతరం స్నేహితులతో కలిసి సుస్మితా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. పబ్, రెస్టారెంట్‌లకు వెళుతూ సింగల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా 'పీస్ ఈజ్ బ్యూటీఫుల్' అంటూ తాను మాత్రమే ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు 'సింగల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సుస్మితా', 'ప్రియుడిని వదిలించుకుని పార్టీలు చేసుకుంటున్నారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వాయిదా పడనుందా?.. అసలు కారణం ఇదే!!

గత కొంతకాలంగా సుస్మితా సేన్ (Sushmita Sen), రోహ్మాన్ షాల్‌ (Rohman Shawl) రిలేషన్‌షిప్‌పై పలు ఊహాగానాలు వచ్చాయి. ఇద్దరు విడిపోయారంటూ (Sushmita Sen Break-Up) వార్తలు వచ్చాయి. అవి నిజమే అంటూ సుస్మితా తాజాగా ప్రకటించారు. 'స్నేహితులుగా మా పరిచయం మొదలైంది. ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం. మా మధ్య బంధం ముగిసినా.. ప్రేమ మాత్రం అలాగే ఉంది' అని సుస్మితా గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. సుస్మితా మరియు రోహ్మాన్ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసారు. అయితే రోహ్మాన్ ఇప్పటికీ సుస్మితా కుమార్తె రెనీని అనుసరిస్తున్నాడు. మోడల్ అయిన రోహ్మన్ వయసు 30 ఏళ్లు కాగా, సుస్మితా వయసు 46. రోహ్మన్ కంటే సుస్మితా 16 ఏళ్లు పెద్దది. 

Also Read: Visakha Steel Plant Fire Accident: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.50 లక్షలు ఆస్తి నష్టం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News