సినీ నటి తమన్నా భాటియా ఇటీవలే కరోనావైరస్ ( Coronavirus ) నుంచి కోలుకున్నారు. దీనికి సంబంధించి ఆమె ట్వీట్ చేసి సమాచారం అందించారు. అక్టోబర్ 5వ తేదీని తనకు కరోనావైరస్ సోకినట్టు సోషల్ మీడియా వేదికలో ప్రకటించింది తమన్నా. చిన్నపాటి జ్వరం మాత్రమే అనుకుని టెస్టులు చేయించగా అది కోవిడ్-19 ( Covid-19) అని తేలింది అని.. అందుకే వెంటనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్టు అక్టోబర్ 5న ట్వీట్ చేసింది.
READ ALSO | Budgam Terrorist Video: నీకేం కాదు, బయటికి రా! ఉగ్రవాదితో సైన్యం ఎలా వ్యవహరించిందో చూడండి
ఆ ట్వీట్ చూడండి.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) October 5, 2020
సుమారు 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత తను పూర్తిగా కోలుకున్నట్టు ఇటీవలే తెలిపిన తమన్నా.. దానికి కారణం అయిన వైద్యులకు థ్యాంక్స్ చెబుతూ నేడు ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ లో ఇలా ఉంది.
"వైద్యులు, నర్సులు, సిబ్బందికి నేను ఎంత రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను. నేను తీవ్ర ఆరోగ్యానికి గురి అయ్యాను. బలహీనంగా, భయంగా అనిపించింది. కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం నన్ను బాగా చూసుకున్నారు. ధైర్యం చెప్పారు. వారి కేరింగ్, దయ వల్ల నేను కోలుకున్నాను" అని ట్వీట్ చేసింది తమన్నా.
తమన్నా (Tamannaah Bhatia ) ఇవాళ చేసిన ట్వీట్ చూడండి.
Words cannot describe how grateful I am to the doctors, nurses and the staff at @Continental_hyd. I was so sick, weak & scared but the you made sure that I was comfortable and treated in the best possible way. The kindness, sincere caring, and concern made everything better! 🙏🏼😇 pic.twitter.com/nSKBC19UwU
— Tamannaah Bhatia (@tamannaahspeaks) October 17, 2020
READ ALSO | Good News: ప్రైవేట్ ఉద్యోగులుకు మోదీ ప్రభుత్వం శుభవార్త!
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR