పాకిస్తాన్ క్రికెటర్‌‌తో కలిసి తమన్నా షాపింగ్.. అసలు సంగతేంటి!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పాకిస్తాన్ క్రికెటర్‌తో కలిసి గోల్డ్ షాపింగ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇదిగో ప్రూఫ్ అంటూ సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటో షేర్ చేస్తున్నారు. Tamannaah with cricketer Abdul Razzak

Last Updated : May 8, 2020, 01:41 PM IST
పాకిస్తాన్ క్రికెటర్‌‌తో కలిసి తమన్నా షాపింగ్.. అసలు సంగతేంటి!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పాకిస్తాన్ క్రికెటర్‌ అబ్దుల్ రజాక్‌తో కలిసి గోల్డ్ షాపింగ్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఇదిగో ప్రూఫ్ అంటూ సోషల్ మీడియాలో వీరిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటో షేర్ చేస్తున్నారు. పాక్ క్రికెటర్, నటి కాంబినేషన్ కావడంతో నెటిజన్లు ఇదే నిజమన్నట్లుగా ఈ ఫొటోను ట్రెండ్ చేస్తున్నారు. కామెంట్లు, లైక్స్‌తో తమ సోషల్ మీడియా అకౌంట్లకు పని చెబుతున్నారు.  బికినీలో అమెరికన్ అందం హాట్ పోజులు

అసలే జరిగింది...
పాక్ మాజీ క్రికెటర్ రజాక్, తమన్నా ఫొటో నిజమే. కానీ వీరిద్దరూ కలిసి షాపింగ్ చేయడమో గానీ, వీరి మధ్య రిలేషన్ లాంటివి నిజం కాదు. 2017కు సంబంధించ ఓ ఫొటో ఇప్పుడు లాక్‌డౌన్ టైమ్‌లో వైరల్ అవుతోంది. దుబాయ్‌లో బంగారు ఆభరణాల స్టోర్ ప్రారంభించారు.

ఆ కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో రజాక్, నటి తమన్నా వేర్వేరుగానే దుబాయ్ వెళ్లారు. అక్కడ జ్యువెలరీ షాప్ వారి కోరిక మేరకు ఫొటోకు పోజిచ్చారు. అంతేగానీ పాక్ క్రికెటర్‌ రజాక్‌తో కలిసి తమన్నా షాపింగ్‌లు చేయడం అనేది నిజం కాదు. ఈ విషయం తెలియక నెటిజన్లు మూడేళ్ల కిందటి ఫొటోను వైరల్ చేస్తున్నారు.   Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా!

కాగా, తమన్నా తెలుగులో చివరగా సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించింది. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’లో డాంగ్ డాంగ్ సాంగ్‌లో స్టెప్పులేసింది. లాక్‌డౌన్ కావడంతో ప్రస్తుతం షూటింగ్స్ లేవు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News