Hanu Man: వెంకటేష్,‌ నానికి సమానంగా కుర్ర హీరో సినిమా.. ఆశ్చర్యపరుస్తున్న ప్రి రిలీజ్ బిజినెస్

Venkatesh Saindhav: వెంకటేష్, నాని అంటే అభిమానించని వారు ఉండరు. వారిద్దరి సినిమాలు వస్తున్నాయి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు ఎంతో ఆసక్తి చూపిస్తారు. తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో వీరిద్దరికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే వీరిద్దరి సినిమాలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంటాయి. కాగా అలాంటి ఈ ఇద్దరు హీరోల సినిమాల ప్రి రిలీజ్ బిజినెస్ కి సమానంగా ఒక కుర్ర హీరో సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ జరగడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2023, 12:53 PM IST
Hanu Man: వెంకటేష్,‌ నానికి సమానంగా కుర్ర హీరో సినిమా.. ఆశ్చర్యపరుస్తున్న ప్రి రిలీజ్ బిజినెస్

Nani Hi Nanna: తేజ సజ్జ పేరు వింటే మనకు ఇప్పటికీ ఇంద్ర సినిమానే గుర్తొస్తుంది. తేజ చిన్న పిల్లోడి క్యారెక్టర్స్ ఇంకా మన మైండ్ లో నుంచి పోలేదు. అలాంటి ఈ కుర్రాడు ఇప్పుడు స్టార్ హీరోలకి పోటీ ఇచ్చే సినిమాతో సిద్ధమవుతున్నారంటే ట్రేడ్ వర్గాలు అలానే సెమీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

ఓ బేబీ, జాంబిరెడ్డి లాంటి సినిమాలతో మంచి హిట్ అందుకున్న తేజ.. ఓటీటీ లో అద్భుతం అనే సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఇలా ఒకటి రెండు సినిమాలలో హీరోగా చేసిన తేజ ఇప్పుడు ఏకంగా వెంకటేష్, నాని సినిమాలకు దీటుగా తన సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. తేజ నటిస్తున్న హనుమాన్ సినిమా వెంకటేష్, నాని సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ కి సమానంగా జరిగిందేమో ఇందుకు కారణం.

వెంకటేష్‌ సైంధవ్‌ అలానే తేజ సజ్జ, ప్రశాంత్‌ వర్మల హనుమాన్‌ చిత్రాలు వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద హోరాహోరీగా తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. మరో పక్క నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం హాయ్ నాన్న డిసెంబర్ 7న విడుదల కానుంది. కాగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తేజ సజ్జ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ వెంకటేష్,‌ నాని హాయ్ నాన్న సినిమాలతో సమానంగా ఉండడం.

వెంకటేష్, నాని టాలీవుడ్ లో పెద్ద స్టార్స్, వారి స్టార్‌డమ్‌ను పోల్చి చూస్తే వారి ముందర తేజ చాలా చిన్న హీరో అని చెప్పాలి. కానీ ఈ మూడు సినిమాలకి కూడా ఆంధ్రప్రదేశ్ లోని ఆరు ప్రాంతాలలో దాదాపు ఒకే రేంజ్ అనగా 10 కోట్ల ప్రియురాలు బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరోపక్క సీడెడ్ ఏరియా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా 3.5 – 4 కోట్ల రేంజ్‌లో మూడు సినిమాలకు ఒకేలా ఉన్నట్టు అంచనా. ఇలా ఒక కుర్ర హీరో సినిమా .. అది కూడా ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ అందుకొని ఒక హీరో సినిమా ఏకంగా ఇద్దరు సూపర్ స్టార్ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ తో సమానంగా ఉండదం అందరిని ఆశ్చర్యపరిస్తోంది. అంతేకాదు ఇది చూస్తూ ఉంటే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు స్టార్ హీరోల కన్నా సినిమా కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా అర్థమవుతోంది.

ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న హనుమాన్ సినిమా మొదటి వీడియో గ్లింప్స్ దగ్గర నుంచి ప్రేక్షకుల అంచనాలు పెంచేసింది. అంతే కాదు అప్పట్లో ఆది పురుష్ సినిమా అన్ని కోట్లు పెట్టి తీసిన హనుమాన్ సినిమా మొదటి వీడియో రేంజ్ లో ఆది పురుష్ ట్రైలర్ లేదు అని అప్పట్లో కామెంట్లు కూడా వినిపించాయి. మరి సినిమా విడుదలయ్యాక కూడా అలానే మంచి పేరు తెచ్చుకొని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది ఏమో చూడాలి. కాగా ఈ చిత్రం జనవరి 12, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Also Read: Kalabhavan Haneef: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత

Also Read: Reservation Bill: కులాల రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. ఆ రాష్ట్రంలో 75 శాతం రిజర్వేషన్లు   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x