Teja Sajja: స్టార్ హీరోల వారసులను అడగరు.. నన్నెందుకు అడుగుతున్నారు.. తేజ సజ్జ అసహనం

HanuMan: హనుమాన్ సినిమా మొదటి లుక్ విరుదలైన దగ్గర నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా చుట్టూ స్టార్ పవర్ లేకపోయినా.. పాన్ ఇండియాపరంగా ఈ చిత్రానికి క్రేజ్ మాత్రం బాగానే ఏర్పడింది…  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2023, 08:14 PM IST
Teja Sajja: స్టార్ హీరోల వారసులను అడగరు.. నన్నెందుకు అడుగుతున్నారు.. తేజ సజ్జ అసహనం

HanuMan Trailer: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న ఇండియన్ సూపర్ హీరో సినిమా ‘హనుమాన్’. ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ లో చెప్పుకోతగినంత స్టార్ పవర్ లేకపోయినా.. ఈ సినిమా టీజర్ ఈ చిత్రం పైన అంచనాలను భారీగా పెంచింది. అప్పట్లో ఆది పురుష్ ట్రైలర్ రిలీజ్ కాగా.. అంత బడ్జెట్ పెట్టి తీసిన ఆది పురుష్ సినిమా కన్నా తక్కువ బడ్జెట్ లో వస్తున్న హనుమాన్ సినిమా క్వాలిటీ ఎంతో బాగుంది అని అందరూ ప్రశంసించారు. దాంతో ఎటువంటి ప్రమోషనల్ ఖర్చు లేకుండా హనుమాన్ సినిమా పైన సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా అంచనాలు వాతంటత అవే పెరిగాయి.

ఈ నేపథ్యంలో ఈరోజు ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఈ సినిమా పైన మరిన్ని అంచనాలను పెంచింది.
ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం  సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్ తరువాత మూవీ టీం మొత్తం మీడియా వాళ్ళతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తేజ సజ్జ మీడియా వాళ్ళ పై ఆగ్రహం వ్యక్తం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.

ఒక మీడియా జర్నలిస్టు తేజ సజ్జ ని ప్రశ్న అడుగుతూ.. “ఈ సినిమా కాన్వాస్ చాలా పెద్దగా ఉంది. మీరు ఆ కాన్వాస్ లో చాలా చిన్నగా కనిపిస్తున్నారు. మీ లెవెల్ కి దాటి వెళ్లారని మీకు అనిపించిందా” అంటూ ప్రశ్నించారు. కాగా ఈ ప్రశ్నకు తేజ సమాధానమిస్తూ “నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నేను ఈ విషయాన్ని చాలా ఒబీడియెంట్ గా చెబుతున్నాను. ఒక సెకండ్ జనరేషన్ హీరో..వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ స్టార్టింగ్ లోనే తనకి మించిన స్థాయిలో సినిమా చేస్తే మీరు ఇదే ప్రశ్న వాళ్లని అడుగుతారా నేను వాళ్ళతో పోల్చుకోవడం లేదు. నేను వాళ్లు ఒకటే అని కూడా అనడం లేదు. కానీ ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ వస్తున్నా. చిన్నప్పుడు కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత ఓ బేబీ లాంటి సినిమా కూడా చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చా. ఇక్కడ నిలదొక్కుకోవడం కోసం నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. అలాంటి ప్రయత్నమే హనుమాన్. నేను ఇంత కష్టపడి సినిమా చేస్తే మీరు సరిపోతారు అని అడుగుతుంటే నన్ను ఎందుకో మీరు చిన్న చూపు చూసినట్లు అనిపిస్తుంది” అంటూ అసహనం వ్యక్తం చేశారు.

కాగా మరో జర్నలిస్ట్ దర్శకుడిని.. కాశ్మీర్ ఫైల్స్ కార్తికేయ లాంటి సినిమాలను బిజెపి ఎంతగానో ప్రసంశించారని అలా అని  బీజేపీకి ఈ మూవీకి సంబంధం ఉందా అని ప్రశ్నించగా, దర్శకుడు బదులిస్తూ.. “ఇప్పుడు లేదు. సినిమా రిలీజ్ తరువాత కచ్చితంగా వస్తుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా అనేక కంట్రీస్ లో మొత్తం 11 భాషల్లో ఈ సినిమా నిర్మాతలు రిలీజ్ చేయనున్నారు.

Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..

Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News