Tollywood: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరి మృతి, అల్లు అర్జున్ అరెస్టు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో సమస్య పరిష్కారం కాలేదు సరికదా మరింత పెరిగినట్టు కన్పిస్తోంది. ఇదే అదనుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు సోఫా కామెంట్లు షాక్ కల్గిస్తున్నాయి.
పుష్ప 2 సినిమా రేపిన వివాదాన్ని పుష్ప 2 తరహాలోనే పరిష్కరించాలని కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ బలోపేతం చేస్తోంది. పుష్ప 2 విడుదల నేపధ్యంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆగ్రహించిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక షోలు, టికెట్ పెంపుకు నో చెప్పేసింది. ఇవాళ తెలుగు సినీ ప్రముఖులంతా కట్టగట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైనా ప్రభుత్వ వైఖరి మారలేదు. టికెట్ల పెంపు, ప్రత్యేక షోలు, బెనిఫిట్ షోలపై అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనలో మార్పు ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం తెలుగు సినిమా ప్రముఖులకు మింగుడుపడలేదు.
ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌తో సంచలనం రేపారు. సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే సోఫా పంపాల్సిందేనంటూ ఆయన చేసిన ట్వీట్‌పై వివిధ రకాల కామెంట్లు వస్తున్నా.యి. కొందరు అంబటి రాంబాబును విమర్శిస్తుంటే మరి కొందరు పుష్ప వివాదానికి పుష్ప తరహాలనే పరిష్కారమా అంటున్నారు. పుష్ప 2 సినిమాలో ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ కోట్ల రూపాయలు అమర్చిన సోఫాలు హీరో బహుమతిగా పంపిస్తుంటాడు. ఇక్కడ కూడా అదే సోఫా పంపించాల్సిందనే అర్ధం వచ్చేలా సమస్య పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందేనని వ్యాఖ్యానించి సంచలనం రేపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు
పూర్తి పరిష్కారానికి
"Sofa" చేరాల్సిందే!— Ambati Rambabu (@AmbatiRambabu) December 26, 2024
Also read: DA Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్, జనవరి నుంచి భారీగా జీతం పెంపు ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.