The Kerala Story: 10 రోజుల్లో 150 కోట్లకు చేరువలో 'ది కేరళ స్టోరీ'..దుమ్ము రేపుతోందిగా

The Kerala Story Day 10 Collections: కేరళలో మిస్సయిన ముగ్గురు అమ్మాయిల జీవిత కథల ఆధారంగా ది కేరళ స్టోరీ సినిమాని తెరకెక్కించారు బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్. ఆ సినిమా 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 15, 2023, 09:02 PM IST
The Kerala Story: 10 రోజుల్లో 150 కోట్లకు చేరువలో 'ది కేరళ స్టోరీ'..దుమ్ము రేపుతోందిగా

The Kerala Story 10 Days Collections: మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ది కేరళ స్టోరీ సినిమా కలెక్షన్స్ విషయంలో ఇంతింతై వటుడింతై అన్నంతగా దూసుకుపోతోంది. కేరళలో మిస్సయిన ముగ్గురు అమ్మాయిల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు బెంగాలీ దర్శకుడు సుదీప్తో సేన్.

విపుల్ అమృత్ లాల్ షా నిర్మాణం వహించిన ఈ సినిమాలో ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. యోగితా బిహాని, సంగీత బలాని వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఒక్కసారిగా వివాదాస్పదం అయింది, ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అయితే కేరళలో 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అంటూ చేసిన ప్రకటన కలకలం రేపింది.

Also Read: Samantha No.1: డిజాస్టర్లు వచ్చినా తగ్గేదేలే.. సమంత ఇంకా నెంబర్.1ఏ!

ఇక ఈ సినిమా ఒక ప్రాపగాండా ఫిలిం అని చెబుతూ తమిళనాడు సహా వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలు సినిమాని పూర్తిస్థాయిలో బ్యాన్ చేశాయి. మరి కొన్ని చోట్ల ఈ సినిమాను తమ థియేటర్లలో ప్రదర్శించం అంటూ కొన్ని థియేటర్ చైన్స్ కూడా ప్రకటించాయి. ఇంతలా ఈ సినిమా మీద నెగిటివిటీ వస్తున్నా సరే సినిమా మాత్రం కలెక్షన్స్ విషయంలో దూసుకుపోతోంది.

ఈ సినిమా మొదటి రోజు 8 కోట్ల మూడు లక్షల నెట్ వసూళ్లు సాధించగా తర్వాత రోజు 11 కోట్లు మూడవరోజు 16 కోట్ల 40 లక్షలు నాలుగో రోజు పది కోట్ల ఏడు లక్షలు, ఐదవ రోజు 11 కోట్ల 14 లక్షలు ఆ తర్వాత రోజు 12 కోట్లు వసూలు చేసింది. ఇక ఏడవ రోజు 12 కోట్ల యాభై లక్షలు వసూలు చేయగా ఎనిమిదో రోజు 12 కోట్ల 35 లక్షలు, 9 వ రోజు 19 కోట్లు మేర వసూలు చేసింది. ఇక తాజాగా ఆదివారం నాడు 14వ మేన 23 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ప్రస్తుతానికి 100 కోట్లను క్రాస్ చేసిన ఈ సినిమా 150 కోట్ల దగ్గరగా వెళుతోంది.

Also Read: Prabhas No.1: టాలీవుడ్ నెంబర్ 1 ప్రభాసే.. ఏప్రిల్ లో కూడా తగ్గని రెబల్ స్టార్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News