టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'శివమణి'. ఇప్పుడు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం మళ్లీ అందరికీ గుర్తుకు వస్తోంది. భవిరి రవి అనే మిమిక్రీ ఆర్టిస్ట్ చేసిన ఓ పేరడీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడమే అందుకు కారణం.
2003లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రను పోషించారు హీరో నాగార్జున. నా పేరు శివమణి... నాక్కొంచెం మెంటల్ అంటూ ఆయన చెప్పే డైలాగులు, రౌడీలను బెదిరించే తీరు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. ఇప్పుడు ఆ సినిమాలో పూర్ణా మార్కెట్ లో జరిగే సీన్ ను భవిరి రవి పేరడీగా తీర్చిదిద్దారు.
కరోనా వైరస్ కారణంగా మాస్కులు లేకుండా తిరిగితే ఓ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ ఎలా వార్నింగ్ ఇస్తాడో భవిరి రవి చక్కగా చేసి చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో హీరో నాగార్జున కూడా దీనిపై స్పందించారు. దాదాపు 16 ఏళ్ల క్రితం చేసిన ఈ సినిమా ఇప్పుడు బాగా గుర్తుకు వస్తోందని ట్వీట్ చేశారు. ఇప్పుడు తాను మళ్లీ శివమణి సినిమాలో నటిస్తే .. దర్శకుడు పూరీ జగన్నాథ్ డైలాగ్స్ ఇలాగే ఉంటాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
If I did the movie Shivamani now,@purijagan s dialogues would be somewhat like this in #CoronavirusCrisis pic.twitter.com/KrFiii8Ug2
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 25, 2020
చికెన్, మటన్ అంటూ గుంపులుగా చేరితే మక్కిలిరుగుతాయ్..!!