Saripodhaa Sanivaram OTT Release: సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం, సెప్టెంబర్ 26న విడుదల

Saripodhaa Sanivaram OTT Release: టాలీవుడ్ నటుడు నాని నటించిన సరిపోదా శనివారం డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ఇప్పటికే బాక్సాఫీసు బరిలో దుమ్ము రేపుతున్నఈ సినిమా ఓటీటీలో హల్‌చల్ చేసేందుకు రెడీ అవుతోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 16, 2024, 11:18 AM IST
Saripodhaa Sanivaram OTT Release: సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం, సెప్టెంబర్ 26న విడుదల

Saripodhaa Sanivaram OTT Release: నేచురల్ స్టార్ నాని నటించిన ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా సరిపోదా శనివారం బాక్సాఫీసు బరిలో కలెక్షన్ల వర్షం కురిసింది. విడుదలైన మూడు వారాల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది ఈ సినిమా. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

టాలీవుడ్ విలక్షణ నటుడు నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సరిపోదా శనివారం బాక్సాఫీసులో కలెక్షన్ల వర్షం కురిపించింది. డీవీవి దానయ్య నిర్మించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చగాల 90 కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తి చేశారు. ఎస్ జే సూర్య, ప్రియాంక అరుల్ మోహన్‌లు నటించారు. అజయ్ ఘోష్, మురళి శర్మ, సాయి కుమార్‌లు ఇతర పాత్రలో కన్పిస్తారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అతని తనయుడు కళ్యాణ్ దాసరి నిర్మించాడు. ఇన్‌స్పెక్టర్ దయా పాత్రలో ఎస్ జే సూర్య నటనకు మంచి గుర్తింపు లభించింది. 

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 100 కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమాగా నాని ఖాతాలో చేరింది. నాని కెరీర్ లో 100 కోట్ల మొదటి సినిమా ఈగ. ఆ తరువాత దసరా సినిమా కూడా 100 కోట్ల వసూళ్లు సాధించింది. అగస్టు 29న ధియేటర్లలో విడుదలైన ఈ సినిమా మూడూ వారాల్లోనే 100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఆగస్టు 29న ధియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 26 నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. 

Also read: Jani Master: లైంగిక వేధింపుల ఆరోపణలపై కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ పై పోలీసు కేసు నమోదు..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News