Rashmika Craze: ఐటెం సాంగ్‌కు అంత పారితోషికమా, వైరల్ అవుతున్న రష్మిక డిమాండ్

Rashmika Craze: నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ఐటెం సాంగ్ కోసం రష్మిక ఎంత అడిగిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 3, 2022, 10:19 PM IST
Rashmika Craze: ఐటెం సాంగ్‌కు అంత పారితోషికమా, వైరల్ అవుతున్న రష్మిక డిమాండ్

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ బిజీగా మారిన నేషనల్ క్రష్..రష్మిక మందన్నా. పుష్పతో స్టార్ హీరోయిన్‌గా మారిన రష్మికకు తన డిమాండ్ ఏంటనేది అర్ధమౌతోంది. అందుకే ఊహించని పారితోషికం కోరుతోంది. 

పుష్ప సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్నా షెడ్యూల్ అస్సలు ఖాళీగా లేదు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ రెండింట్లోనూ వరుస ఆఫర్లు ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్నా..ఐటెం సాంగ్స్ వచ్చినా కాదనడం లేదు. కానీ తన క్రేజ్‌కు తగ్గట్టు డిమాండ్ చేసి అందర్నీ నివ్వెరపరుస్తోంది. అందుకే మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో ఐటెం సాంగ్‌కు ఓకే చెప్పేసింది. కానీ ఆ ఐటెం సాంగ్ కోసం ఎంత అడిగిందో తెలిస్తే నోరెళ్లబెడతారు. 

మహేశ్ బాబు హీరోగా దర్శకుడు రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 తీస్తున్నాడు. అటు త్రివిక్రమ్ మహేశ్‌తో ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ నడుస్తోంది. ఈ సినిమాలో గ్లామర్ డోస్ ఎక్కువగా ఉంచేందుకు త్రివిక్రమ్ ఇప్పటికే పూజా హెగ్డే, శ్రీలీలను తీసుకున్నాడు. ఈ ఇద్దరికి తోడుగా రష్మిక మందన్నా చేరింది. రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్‌లో హల్‌చల్ చేయనుంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం రష్మిక ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేసిందట. అదే ఇప్పుడు వైరల్ అవుతోంది. అన్నట్టు రష్మికకు ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో కలిసి వారసుడు సినిమా చేస్తోంది. అటు చియాన్ విక్రమ్ సినిమాకు కూడా రష్మిక దాదాపుగా ఖరారైంది. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్దతో కలిసి మిషన్ మజ్ను చేస్తోంది. 

ఈ ఆఫర్ల సంగతి ఎలా ఉన్నా..త్రివిక్రమ్ మహేశ్‌బాబు సినిమాలో ఐటెం సాంగ్ కోసం డిమాండ్ చేసిన పారితోషికమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

Also read: Sapthami Gowda Pics: బ్లాక్ మినీ స్కర్ట్స్‌లో సప్తమి గౌడ.. కేక‌పెట్టిస్తున్న కాంతార బ్యూటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News