Kalakaar teaser : చాలా గ్యాప్‌ తర్వాత హీరో రోహిత్‌ మూవీ, కళాకార్‌ సినిమా టీజర్‌‌ రిలీజ్‌ చేసిన ప్రభాస్‌

Rohit's Kalakaar teaser : రోహిత్‌ హీరోగా యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కళాకార్‌.  శ్రీను బండెలా దర్శకత్వం వహించిన ఈ మూవీకి వెంకట్‌ రెడ్డి జయపురం నిర్మాతగా వ్యవహరించారు. సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ని ఆదివారం రెబల్‌ స్టార్‌‌ ప్రభాస్‌ రిలీజ్‌ చేశారు.

Last Updated : Sep 19, 2021, 02:56 PM IST
  • యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కళాకార్‌
  • శ్రీను బండెలా దర్శకత్వంలో మూవీ
  • టీజర్‌ని రిలీజ్‌ చేసిన రెబల్‌ స్టార్‌‌ ప్రభాస్‌
Kalakaar teaser : చాలా గ్యాప్‌ తర్వాత హీరో రోహిత్‌ మూవీ, కళాకార్‌ సినిమా టీజర్‌‌ రిలీజ్‌ చేసిన ప్రభాస్‌

Tollywood Rebel star Prabhas releases Rohit's Kalakaar teaser: 6 టీన్స్‌, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌ వంటి సినిమాల హీరో  రోహిత్‌ చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ తెరపై కనిపించనున్నారు. రోహిత్‌ (Rohith) హీరోగా యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం కళాకార్‌ (Kalakaar).  శ్రీను బండెలా దర్శకత్వం వహించిన ఈ మూవీకి వెంకట్‌ రెడ్డి జయపురం నిర్మాతగా వ్యవహరించారు. సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌ని ఆదివారం రెబల్‌ స్టార్‌‌ ప్రభాస్‌ రిలీజ్‌ చేశారు. టీజర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉందని ప్రభాస్‌ అన్నారు. ప్రతి సన్నివేశం ఉత్కంఠ రేకెత్తించేలా సాగిందని తెలిపారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

 

Also Read : Viral news: రైతు పింఛన్ అకౌంట్‌లో రూ. 52 కోట్లు..షాక్ తిన్న వృద్ధుడు!
రోహిత్‌ క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా శంక‌ర్‌దాదా MBBS,నవ వసంతం వంటి సినిమాల్లో నటించారు. ఇక రోహిత్‌ పోలీస్ ఆఫీస‌ర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని ఇటీవల నటుడు శ్రీకాంత్‌ (Srikanth) విడుదల చేశాడు. కళాకార్‌ మూవీని దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు మూవీ టీం తెలిపింది.

Also Read : MaheshBabu NTR: ఎన్టీఆర్‌‌ షోలో రాజమౌళి, కొరటాల శివ సందడి.. నెక్ట్స్‌ మహేశ్‌బాబు అని టాక్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News