Tollywood star heros:స్టార్ హీరోల బిజినెస్.. ఎవరు ఏ రేంజ్ లో ఉన్నారో తెలుసా?

Tollywood heros market value: టాలీవుడ్ లో స్టార్ హీరోలకు కొదవలేదు. తెలుగు సినిమాకి వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చిన మన హీరోలు ఇంటర్నేషనల్ మార్కెట్లో ధమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ హీరో బిజినెస్ ఏ రేంజ్ లో ఉందో తెలుసుకుందాం..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 19, 2024, 07:53 PM IST
Tollywood star heros:స్టార్ హీరోల బిజినెస్.. ఎవరు ఏ రేంజ్ లో ఉన్నారో తెలుసా?

Tollywood top 1 hero: టాలీవుడ్ బాక్స్‌ఆఫీస్ నుంచి ఇండియన్ బాక్స్‌ఆఫీస్‌కు అలా అంచలంచలుగా ఎదుగుతూ  పాన్‌ఇండియా సినిమాలతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్‌ని కైవసం చేసుకుంటున్నారు మన టాలీవుడ్ హీరోలు. కేవలం స్టార్ హీరోలే కాదు..టైర్ 2, టైర్ 1 హీరోలు సైతం మంచి యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతో భారీ ప్రాజెక్టులు చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే ఏ హీరోతో ఏ రేంజ్ సినిమా తీస్తే.. కలెక్షన్స్ బాగా వస్తాయి అన్న విషయంపై దర్శక నిర్మాతల దగ్గర.. ప్రత్యేకమైన లెక్కలు ఉన్నాయట. 

ఈ లెక్కలను బట్టి ఆ హీరోల మూవీస్ కి బడ్జెట్‌ను నిర్ణయించి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం ఉన్న అందరూ హీరోలలో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు మాత్రం పెద్దగా ఈ మార్కెట్ విలువలు పట్టించుకోవడం లేదు. బాహుబలి తరువాత అతని సినిమాలు మూడు వరుసగా ప్లాపులు అయినప్పటికీ.. భారీ బడ్జెట్‌తో చిత్రాలు తీయడానికి దర్శక నిర్మాతలు లైన్ కట్టారు. సలార్ విజయంతో ప్రభాస్ తిరిగి ట్రాక్లోకి వచ్చి.. కల్కి 2898ఏడీ మూవీతో రికార్డు సృష్టించారు. దీంతో ప్రభాస్ బిజినెస్ వాల్యూ సుమారు 600 కోట్లకు పైగా.. చేరినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. పుష్ప మూవీ సక్సెస్ తర్వాత.. అల్లు అర్జున్ మార్కెట్ సుమారు 400 కోట్ల వరకు.. చేరుకుంది. త్వరలో పుష్ప 2 మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రికార్డు స్థాయి బిజినెస్ నెలకొల్పితే బన్నీ మార్కెట్ వేల్యూ మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు.

మూడవ స్థానంలో ఉన్న పాన్ ఇండియా స్టార్స్ గా.. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఈ ఇద్దరి హీరోల మార్కెట్ 400 కోట్ల.. వరకు పలుకుతోంది. అయితే ఇప్పుడు ఇద్దరూ వేరు వేరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ పర్ఫామెన్స్ ని పట్టి వీరి గ్లోబల్ మార్కెట్ విలువ ఉంటుందని అంచనా.

ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలుగా చక్రం తిప్పిన.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కుర్ర హీరోలకు ధీటుగా వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నారు. వీరి మార్కెట్ వాల్యూ 150 కోట్ల నుంచి 200 కోట్ల మధ్యలో ఉండొచ్చని అంచనా. ఇక నాచురల్ స్టార్ నాని.. నిలకడగా సినిమాలు చేసుకుంటూ.. క్రమంగా తన మార్కెట్ వాల్యూ పెంచుకుంటూ వెళ్తున్నాడు. దసరా, హాయ్ నాన్న లాంటి చిత్రాలు అతని మార్కెట్ విలువను బాగా పెంచాయి. దీంతో ప్రస్తుతం అతని మార్కెట్ వాల్యూ 60 కోట్ల వరకు ఉంది . రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. సినిమాలకు ప్రస్తుతం 80 కోట్ల వరకు మార్కెట్ వాల్యూ ఉంది. గీత గోవిందం లాంటి సాలిడ్ కంటెంట్ ఉన్న హిట్ మరొకటి అతని ఖాతాలో పడితే అతని మార్కెట్ విలువ 100 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు.

Read more: Mohanlal:  ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మలయాళ స్టార్ హీరో.. టెన్షన్ లో ఫ్యాన్స్... అసలేం జరిగిందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News