Mahesh fans vs Vijay fans: రెచ్చిపోయిన స్టార్ హీరోల అభిమానులు.. రాయలేని విధంగా ట్రోలింగ్

War Between Mahesh Babu fans and Thalapathy Vijay Fans. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రచ్చ రేగింది.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 6, 2022, 02:02 PM IST
Mahesh fans vs Vijay fans: రెచ్చిపోయిన స్టార్ హీరోల అభిమానులు.. రాయలేని విధంగా ట్రోలింగ్

Ugly Social Media War Between Mahesh Babu fans and Thalapathy Vijay Fans: ఈ మధ్యకాలంలో హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఒకరి హీరోను మరొకరు ట్రోల్ చేసుకోవడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానుల మధ్య ఇదే రకమైన ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి అందరకీ గుర్తుండే ఉంటుంది. దారుణమైన రాయలేని విధమైన పదాలతో ఒకరినొకరు ట్రోల్ చేసుకోవడం మనం చూశాం. ఇప్పుడు అదే కోవలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో రచ్చ రేగింది. దీనికి కారణం తెలుగు సోషల్ మీడియా మీమ్ పేజెస్ అని చెప్పక తప్పదు.#MBfansUnderVIJAYfansFoot

ఈ మధ్య కాలంలో ఇండియన్ క్రికెట్ టీం ఏ మ్యాచ్ ఆడినా సరే ఒకవేళ ఓడిపోయే పరిస్థితులలో ఉంటే విజయ్ ఫోటోలతో ఉన్న మీమ్స్ వేస్తూ తెలుగు సోషల్ మీడియా అడ్మిన్స్ ఒక రకంగా విజయ్ అభిమానులకు కోపం తెప్పించారు. అయితే ఇక్కడ వారి తప్పు కూడా లేదు నలుగుర్ని నవ్వించాలనే వాళ్ల ఇంటెన్షన్ ను విజయ్ ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ క్రమంలో తెలుగు సోషల్ మీడియా మీమ్ పేజీ అడ్మిన్స్ చేసిన పనికి తెలుగు వాళ్ళందరూ మా విజయ్ నీ ట్రోల్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మహేష్ బాబును విజయ్ అభిమానులు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. గతంలో మహేష్ బాబు చేసిన ఒక్కడు లాంటి సినిమాలని విజయ్ తమిళంలో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఒరిజినల్ కంటే రీమేక్ బాగుందని విజయ్ అభిమానులు ట్రోల్ చేస్తుంటే మహేష్ అభిమానులు కూడా రంగంలోకి దిగి విజయ్ ను దారుణంగా రాయలేని విధంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.

#NationalTrollMaterialVijay అసలు ఎందుకు కొట్టుకుంటున్నారో కూడా తెలియకుండా ఇద్దరు హీరోల అభిమానులు ఒకరకంగా దారుణమైన విధంగా ఇలా ట్రోల్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఒక్కరోజు ముందే కన్నడ స్టార్ హీరోయిన్ యష్ అలాగే కన్నడ స్టార్ హీరో సుదీప్ అభిమానుల మధ్య కూడా ఇదే విధమైన గొడవ చెలరేగింది. ఆ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా దాదాపుగా బూతులతో కూడిన సంవాదం ఇలానే నడిచింది. ఇప్పుడు మహేష్ బాబు విజయ్ అభిమానుల మధ్య ఈ విధంగా గొడవ జరగడం కూడా హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు సినిమా విషయానికి వస్తే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన సిట్టింగ్స్ ప్రస్తుతానికి హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్లో జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అందులో నిజా నిజాలు ఏం మేరకు ఉన్నాయి అనే విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Also Read: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రాశుల వారికి అధిక ధన వ్యయం తప్పదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News