Deepika Padukone: అస్వస్థత వెనుక అంత ఉందా? ప్రభాస్ షాకింగ్ ట్విస్ట్!

Anxiety issues to Deepika Padukone: ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్లో దీపికా అస్వస్థతకు గురైనట్టు వార్తలు రాగా అది నిజం కాదని నిర్మాతలు ఖండించారు. కానీ ఆమె అస్వస్థతకు గురవడానికి వేరే కారణం ఉందని తెలుస్తోంది.   

Last Updated : Jun 15, 2022, 07:42 PM IST
  • దీపికా అస్వస్థత వెనుక మరో కారణం
    ఇబ్బందిగా ఫీలవుతున్న ప్రభాస్
    హైదరాబాద్ లో నిలిచిన షూటింగ్?
Deepika Padukone: అస్వస్థత వెనుక అంత ఉందా? ప్రభాస్ షాకింగ్ ట్విస్ట్!

Anxiety Issues to Deepika Padukone:  బాహుబలి దెబ్బకు ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన ఏ సినిమా చేసినా దాన్ని పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడమే కాక భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్న ఒక సినిమా విషయంలో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్లో ఉన్న దీపికా పదుకొనె అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా కలకలం రేగినట్టు అయింది. 
 
రామోజీ ఫిలింసిటీలో ప్రస్తుతం ప్రాజెక్టు కే సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే కూడా  షూటింగ్ లో భాగంగా కొన్ని సీన్స్ లో నటిస్తోంది. అయితే అలా నటిస్తున్న క్రమంలో ఒక్కసారిగా దీపికా పదుకొనే కళ్లు తిరిగి పడిపోవడంతో యూనిట్ సభ్యులంతా ఆమెను హాస్పిటల్ కు తరలించారని వార్తలు వచ్చాయి. అయితే ఆమెకు ఏమైంది అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు కానీ రకరకాల వార్తలు రావడంతో ఈ విషయం మీద నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. దీపికా అనారోగ్యం పాలవలేదని, ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ అధికారిక ప్రకటన చేశారు. 

దీపికా హాస్పిటల్ కి వెళ్లిన మాట నిజమే కానీ అది మూడు రోజుల క్రితం విషయమని నిర్మాతలు ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఈ విషయం మీద స్వయం ప్రకటిత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు సభ్యుడు, క్రిటిక్ అని చెప్పుకునే ఉమైర్ సంధు కొన్ని ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్స్ ప్రకారం దీపికా పదుకొనే హాస్పిటల్ కి వెళ్లడం వెనుక కొన్ని యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీపికకు  ప్రాజెక్ట్ కే సెట్స్ లో ఉండగా పానిక్ అటాక్ అయిందని ఉమైర్ పేర్కొన్నాడు. 

ఆమె ప్రస్తుతానికి యాంటీ యాంగ్జైటీ మెడిసిన్ వాడుతోంది అని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఆమె సెట్స్ లో ఇబ్బంది పెడుతోందని అందుకే ప్రభాస్ కూడా ఆమె విషయంలో అంత ఆసక్తి చూపడం లేదని ఆయన పేర్కొన్నాడు. దీపికా పదుకొనే సెట్స్ లో కాస్త హడావిడి చేస్తూ ఉండడంతో మృదు స్వభావి అయిన ప్రభాస్ కూడా ఇరిటేషన్ ఫీల్ అవుతున్నట్లు కూడా ఉమైర్ సంధు పేర్కొన్నాడు.. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు కానీ అతని ట్వీట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
Read Also: Tollywood Number 1 హీరోగా ప్రభాస్… ఒక్క అప్డేట్ కూడా లేకుండా సూపర్ క్రేజ్ ఎలా?

Read Also : Neha Shetty: టాలీవుడ్ యువ హీరోతో 'డీజే టిల్లు' హీరోయిన్‌ రొమాన్స్.. త్వరలోనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News