Vaishali Takkar: వైశాలి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. ముందే తెలిసి జంపైన రాహుల్!

Vaishali Takkar Case New Update: వైశాలి ఠక్కర్ ఆత్మహత్య కేసులో కొన్ని కొత్త, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి, పోలీసుల విచారణలో రాహుల్ నవ్లానీ కీలక వివరాలు బయటపెట్టారు.

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 22, 2022, 10:29 PM IST
Vaishali Takkar: వైశాలి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. ముందే తెలిసి జంపైన రాహుల్!

Vaishali Takkar Case New Update: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్రెండ్, టీవీ నటి వైశాలి ఠక్కర్ ఆత్మహత్య కేసులో కొన్ని కొత్త, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైశాలి ఠక్కర్ అక్టోబర్ 16, 2022న తన ఇండోర్ నివాసంలో  ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఈ సమయంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్ తన మరణానికి పొరుగింట్లో ఉండే రాహుల్ నవ్లానీని కారణమని పేర్కొంది. అప్పటి నుంచి పోలీసులు చాలా ప్రయత్నాల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇక కోర్టు ఆయన్ని 4 రోజుల రిమాండ్‌కు కూడా పంపింది. ఇక కోర్టు ముందు రాహుల్ చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడని అంటున్నారు. వైశాలి ఠక్కర్ ఆత్మహత్య చేసుకున్న మూడు రోజుల తర్వాత, అక్టోబర్ 19 బుధవారం నాడు రాహుల్ నవ్లానీని అరెస్టు చేశారు. ఘటన జరిగిన రోజు నుంచి రాహుల్ పరారీలో ఉన్నాడు. రాహుల్ దేశం విడిచి పారిపోలేని విధంగా పోలీసులు అన్ని దారులను దిగ్బంధనం చేశారు. ఎట్టకేలకు అరెస్ట్ చేసి అక్టోబర్ 20న గురువారం, పోలీసులు రాహుల్‌ను కోర్టులో హాజరుపరిచారు.

అక్కడ నుండి నాలుగు రోజుల పోలీసుల రిమాండ్‌కు పంపారు. ఈ సందర్భంగా రాహుల్ సూసైడ్ నోట్‌కు సంబంధించి పలు విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది. వైశాలి ఆత్మహత్య గురించి రాహుల్‌కు ముందే తెలుసని అంటున్నారు. వైశాలి ఆత్మహత్య చేసుకోవడానికి 6 గంటల ముందు, నటి ఆ నోట్‌ను తన భార్య దిశకు పంపిందని రాహుల్ పోలీసులకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ వైశాలి తల్లికి చెప్పాడు. ఈ క్రమంలో అలా చేయవద్దని ఆమె తల్లి వైశాలిని చాలా ఒప్పించడానికి ప్రయత్నించింది, కానీ వైశాలి అంగీకరించకుండా ఆత్మహత్య చేసుకుంది.

ఆ తర్వాత రాహుల్ ఇంటి నుంచి పారిపోయాడు. ఇక విచారణలో రాహుల్ నిర్దోషి అని ప్రకటించుకోవడమే కాక తన సోషల్ మీడియా ఖాతాను కూడా డిలీట్ చేశాడు. ఇక అతని మొబైల్ కూడా ఫార్మాట్ చేయబడింది. అన్నింటినీ రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ బయట పెట్టడంలేదు. అయితే రాహుల్ బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరించేవాడని, వైశాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు. శారీరక సంబంధాలు పెట్టుకోవాలని, పెళ్లి చేసుకోవాలని రాహుల్ ఒత్తిడి చేసేవాడని ఆయన ఆరోపించారు. కొట్టేందుకు కూడా ప్రయత్నించాడని, దీని వల్ల వైశాలి చాలా భయపడిపోయింది, కానీ అందరి ముందు బాగానే ఉండేదని చెబుతున్నారు. 
Also Read: Prabhas Facts: హీరో కాకుంటే ప్రభాస్ అదే అయ్యేవాడట.. 20 ఏళ్లలో ఎన్ని వందల కోట్లు సంపాదించారో తెలుసా?

Also Read: Ginna Colletcions: టాక్ బాగానే ఉన్నా షాకిస్తున్న కలెక్షన్స్.. విష్ణు కొంప ముంచిన ట్రోలర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x