Vaishnav Tej: అప్పుడు పవన్.. ఇప్పుడు రామ్ చరణ్ ..మరి వైష్ణవ తేజ్ ఓర్జినాలిటీ ఎప్పుడు

Tollywood Heroes: ఏ హీరో కైనా తమదైన యాక్టింగ్ స్టైల్ ఉంటుంది. అలా ఉంటేనే ప్రేక్షకులు కూడా ఆ హీరో కి జేజేలు పట్టి అభిమానులుగా మారుతూ ఉంటారు. ఇలా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్, నాని ఇంకా మరి ఎంతోమంది హీరోలు తమ తమ స్టైలిష్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2023, 05:05 AM IST
Vaishnav Tej: అప్పుడు పవన్.. ఇప్పుడు రామ్ చరణ్ ..మరి వైష్ణవ తేజ్ ఓర్జినాలిటీ ఎప్పుడు

Tollywood heroes acting style: మన తెలుగు ఇండస్ట్రీలో వరసత్వంగా వచ్చిన హీరోల లో కూడా తమ సొంత స్టైల్ యాక్టింగ్ ఉన్నవారు మాత్రమే స్టార్ హీరోలుగా నిలిచారు. ఉదాహరణకి కృష్ణ కొడుకుగా వచ్చిన మహేష్ బాబు చూడడానికి కృష్ణ లాగా ఉండొచ్చు ఏమో కానీ యాక్టింగ్ మాత్రం కృష్ణా కన్నా వేరుగా ఉంటుంది. చిరంజీవి.స పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.  వీరిద్దరూ చూడడానికి ఒకేలాగా ఉండొచ్చు కానీ వారి యాక్టింగ్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్. సీనియర్ ఎన్టీఆర్ ..బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ వీరు ముగ్గురు కూడా వారి వారి డిఫరెంట్ స్టైల్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన వాళ్ళే.

దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే వారసత్వంగా వచ్చిన తమ తమ యాక్టింగ్ స్టైల్ తమకు ఉంటేనే వారు సూపర్ స్టార్ లగా ఎదగగలరు. ప్రభాస్ అయిన అల్లు అర్జున్ అయినా ఫాలో అయింది ఇదే.. అందుకే వారు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు.

కానీ ఇది గుర్తించలేక కొంతమంది హీరోలు మాత్రం తమ వారసత్వ యాక్టింగ్ ని కూడా కాపీ చేస్తూ వెనక పడుతున్నారు. ముఖ్యంగా తన మొదటి చిత్రం ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి తేజ్.. ఆ తరువాత తన ఓర్జినాలిటీని తిని ఎక్కడ వదిలి పెట్టేసాడు. ఆ మధ్య వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమాలో పవన్ కళ్యాణ్ యక్టింగ్ ని ఇమిటేట్ చేస్తూ వచ్చిన ఈ హీరో ఇప్పుడు ఆదికేశవ సినిమాలో రామ్ చరణ్ ని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించక మానదు. 

ఆది కేశవ సినిమా ట్రైలర్ ఈ మధ్యనే విడుదలై ప్రేక్షకుల దగ్గర మరో రొటీన్ సినిమా రాబోతోంది అని అనిపించుకుంది. ఈ నేపథ్యంలో కథ రొటీన్ అనే విషయం పక్కన పెడితే వైష్ణవ తేజ్ యాక్టింగ్ కూడా రొటీన్ గానే ఉంది. ముఖ్యంగా మొదట్లో వచ్చిన కొన్ని షాట్స్ లో వైష్ణవ్ రామ్ చరణ్ ని అచ్చు గుద్దినట్టు ఫాలో అయిపోయారు అని అర్థమవుతుంది. వైష్ణవ్ అనే కాదు.. ప్రస్తుతం వారసత్వంగా వస్తున్న ఎంతోమంది హీరోలు ఇలా తమ ఫ్యామిలీలో ఫేమస్ అయిన హీరోలను ఫాలో అవుతూ .. తమకంటూ ఒక స్టైల్ మెనిరిజం లేకుండా యాక్టింగ్ చేస్తున్నారు.

వారందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే.. స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినా కానీ తమ సొంత యాక్టింగ్ స్టైల్  ఉన్న హీరోలు మాత్రమే  తెలుగు ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకోగలిగారు అని. ఎందుకంటే ఆల్రెడీ ఒకరు ఒక స్టైల్ లో ఆడ్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో హీరో దగ్గర అదే స్టైల్ చూడాలని ప్రేక్షకులు ఎందుకు అనుకుంటారు..? కాబట్టి ఎవరు వారి యాక్టింగ్ స్టైల్ ఫాలో అయితే.. అది వారికి మంచిది.. ప్రేక్షకులకు చూడముచ్చటగా ఉంటుంది..

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x