MLA Malladi Vishnu: మళ్లీ నోరు జారిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. ఈ సారి భక్తులపై..

మొన్న డోంటాక్‌.. అంటూ నోరు జారిన విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులపై ఈ రోజు కాకపొతే రేపు దర్శనం కోపానికి గురయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2021, 02:42 PM IST
  • మరోసారి నోరు జారిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు
  • ఈ రోజు కాకపొతే రేపు దర్శనం చేసుకోండని సలహా
  • ఎమ్మెల్యే సమాధానంతో కోపానికి గురైన భక్తులు
MLA Malladi Vishnu: మళ్లీ నోరు జారిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. ఈ సారి భక్తులపై..

MLA Malladi Vishnu: కొద్ది  రోజుల క్రితం,  ఐటీఐ ఉద్యోగుల సభలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ (MLC) ఐ.వెంకటేశ్వరరావుపై (Venkateshwara rao) ‘‘డోంటాక్‌... వాటీస్‌ దిస్‌ నాన్‌సెన్స్‌..’’ అంటూ రెచ్చిపోయిన విజయవాడ సెంట్రల్‌ (Vijayawada Central MLA )ఎమ్మెల్యే మల్లాది విష్ణు (MLA Malladi Vishnu) మరొకసారి నోరు పారేసుకుని వార్తల్లోకి ఎక్కారు. ఈ సారి విజయవాడ అమ్మావారై (Vijayawada Durga Temple) ఆలయంలోనే జనాలపై రెచ్చిపోయారు ఎమ్మెల్యే సాప్. 

అసలేం జరిగింది అంటే... గురువారం రాత్రి దర్శనానికి అమ్మవారి దర్శనం కోసమని ఆన్‌లైన్‌లో టికెట్లు కొని లైన్లో నిలబడ్డారు భక్తులు. ఆలయ దర్శనానికి అనుమతి లేదని... భక్తులు క్యూలో ఉండగానే రాత్రి 9:20 గంటలకు గుడి తలుపులు మూసేసారు. అదే సమయంలో అమ్మవారి దర్శనం కోసం ఎమ్మెల్యే మల్లాది విష్ణు  అక్కడకి వచ్చారు. 

Also Read: ChaiSam Divorce: సమంత షాకింగ్ పోస్ట్... ట్రోల్స్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ వార్నింగ్.. పోస్ట్ వైరల్

ఎమ్మెల్యే (MLA) కారు టోల్ గేటు దగ్గరకి సమీపించగానే భక్తులందరు కారును చుట్టూ ముట్టారు. అప్పటి వరకు భక్తులు అడిగే ప్రశ్నలు ప్రశాంతంగా కారులోనే కూర్చొని సమాధానం చెప్తున్న మల్లాది విష్ణు.. ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు కోపం కట్టలు తెచ్చుకోవటంతో కారు దిగి "ఈ రోజు కాకపొతే రేపు వచ్చి దర్శనం చేసుకోండి" అని కోపంగా సమాధానం ఇచ్చారు 

అది విన్న భక్తులు ఎమ్మెల్యే మల్లాదిపై కోపానికి గురయ్యారు. "గురువారం స్లాట్ బుక్ చేస్తుకున్న టికెట్లతో శుక్రవారం దర్శనానికి ఎలా అనుమతిస్తారు..?" అని ప్రశ్నించారు. చేసేదేమి లేక ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమాధానం చెప్పకేక అక్కడి నుండి వెళ్లిపోయారు. 

Also Read: Railway Recruitment: రైల్వే శాఖలో 904 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..అప్లై చేయండి ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News