Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఆ మూవీకి వక్కంతం వంశీ కథ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మాణ బాధ్యతలు వహించారు. అయితే అప్పట్లో బండ్ల గణేష్ వక్కంతం వంశీకి రెమ్యూనరేషన్ ఇవ్వడంలో మొండి చేయి చూపించాడు అని చాలా రూమర్లు వచ్చాయి. ఇక వాటిని నిజం చేస్తూ వక్కంతం వంశీ కేసు కూడా వేశారు.
తనకు ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, తనకు ఇచ్చిన చెక్కు సైతం బౌన్స్ అయిందని బండ్ల గణేష్ మీద కేసు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. కాగా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే విషయంపై మరోసారి స్పందించారు ఈ డైరెక్టర్.
వక్కంతం వంశీ నితిన్ హీరోగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమా తీయగా ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదలై పర్వాలేదు అనిపించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను కథ ఇచ్చిన టెంపర్ సినిమా గురించి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఈ దర్శకుడు.
వక్కంతం వంశీ రైటర్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు. అందులో మనకు ఎక్కువగా గుర్తుంది పోయే సినిమా టెంపర్. ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబోలో సినిమా చర్చలు జరుగుతున్న సమయంలో కథ సెట్ అవ్వకపోవడంతో వంశీ రాసిన కథను ఎన్టీఆర్ ఎప్పుడో విన్నాడట. కాకా జూనియర్ ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ వేరే వాళ్ల కథను తీసుకుంటారా? అని అనుమానపడ్డారట. కానీ పూరికి కూడా కథ నచ్చడంతో ప్రాజెక్ట్ సెట్ అయిందట. ఇక ఆ చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా బండ్ల గణేష్‌ని తన రెమ్యూనరేషన్ కోసం వంశీ అడుగుతూ ఉండేవాడట. ఇక ఆ తర్వాత ఏమయిందో తెలియజేశారు వంశీ. ఆయన మాట్లాడుతూ ‘సినిమా విడుదలైంది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓ చెక్కు ఇచ్చాడు. కానీ అది బౌన్స్ అయింది. అసోసియేషన్స్‌కు కంప్లైంట్ చేద్దామంటే.. సినిమా విడుదలయ్యాక వాళ్లు కూడా ఏం చేయలేరు.. పైగా వాడు (బండ్ల గణేష్) కూడా నా ఫ్రెండే.. అందుకే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇక తప్పని పరిస్థితుల్లో నేను కోర్టులో కేసు వేశాను.. కోర్టుల చుట్టూ బాగానే తిరిగాను.. తిప్పించాడు.. చివరకు డబ్బులు సెటిల్మెంట్ చేశాడు. మాట్లాడుకున్న రెమ్యూనరేషన్ ఇవ్వాలి కదా?.. అయినా ఆ పరిస్థితుల్లో వాడికి ఎలాంటి కష్టాలు వచ్చి ఉంటాయో.. కానీ నా కష్టాలు నాక్కూడా ఉంటాయి. ఆ వివాదం తరువాత హిందీ రీమేక్ కోసం ఇద్దరం ఒకే ఫ్లైట్‌లో వెళ్లాం.. నేను కేసు వేశాననే కోపం వాడికి ఉండే ఉంటుంది’ అంటూ ఈ విషయాన్ని నవ్వుతూ చాలా సాఫ్ట్ గా చెప్పారు వక్కంతం వంశీ.
Also Read: WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?
Also Read: Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి