Ananya nagalla angry on trollers: ఇటీవల కాలంలో కొంత మంది ట్రోలర్స్ సోషల్ మీడియాలో మాధ్యమాలలో రెచ్చిపోతున్నారు. ఫెమస్ పర్సనాలిటీస్ ను టార్గెట్ చేసుకుని ట్రోలింగ్ లకు పాల్పడుతున్నారు. దీనిలో రాజకీయ నాయకులు, పొలిటిషియలన్స్ ఉంటున్నారు. అదే విధంగా.. వీరి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ల గురించి ఇష్టమున్నట్లు ట్రోలింగ్ లకు పాల్పడుతున్నారు. వారు చెప్పేదాంట్లో ఎంత నిజముందని కూడా ఆలోచించుకొవడం లేదు.
దీనివల్ల చాలామంది కూడా సోషల్ మీడియాలో పొస్ట్ చేద్దామంటే.. ఏదైన యాక్టివీటి అభిమానులతో పంచుకుందామంటే తెగ భయపడిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా, వకీల్ సాబ్ ఫెమ్ అనన్య నాగళ్ల ట్రోలింగ్ కు గురయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
వకీల్ సాబ్ భామ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ నేపథ్యంలో ఈ భామ తాజాగా ట్రోలర్స్ బారిపడ్డారు. అయితే.. ఈ నటి మల్లేషం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అయితే.. ఈ నటికి మాత్రం.. వకీల్ సాబ్ సినిమాతో చాలా గుర్తింపు వచ్చిందని చెప్పుకొవచ్చు. ఆ మూవీలో.. ఈ నటి దివ్యానాయక్ పాత్రలో నటించారు. అదే విధంగా 2024 లో ఈ నటి తంత్ర మూవీలో నటించారు. ఈ నేపథ్యలో ఇటీవల అనన్య నాగళ్ల ప్లాస్టిక్ వినియోగం వీలైనంతగా తగ్గించుకొవాలన్నారు.
దానికి బదులుగా స్టీల్ స్ట్రాలను ఉపయోగించాలని వీడియో పొస్ట్ చేశారు. దీంతో నెటిజన్ లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. స్టీల్ స్ట్రాలను ఎవరు ఉపయోగిస్తారన్నారు. నువ్వు అంతగా ప్లాస్టిక్ ను అవాయిడ్ చేస్తున్నావా..?. . నువ్వు చెప్తుంది పాజిబుల్ అవుతుందా..అని కౌంటర్ ఇచ్చారు.
దీనిపై తాజాగా అనన్య స్పందించారు. కొంత మంది తన మాటల్ని పూర్తిగా తప్పుదొవ పట్టించారన్నారు. అంతేకాకుండా.. నేను చెప్పింది.. మీకు నచ్చితే చేయండి లేకపోతే చేయకండని అన్నారు. ప్రతిదానికి ఇలా ట్రోల్ చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.