Vijay Devarkonda: మనిషికి ఆ మూడు ముఖ్యం..జర్నలిస్టులకు భూములు ఇవ్వండి: విజయ్ దేవరకొండ

Telugu Film Journalist Association: తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌ 20 సంవత్సరాలు  పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఘనంగా ఈవెంట్ జరిగింది. ఈ క్రమంలో ఈ ఈవెంట్ కి విచ్చేసిన విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2024, 04:00 PM IST
Vijay Devarkonda: మనిషికి ఆ మూడు ముఖ్యం..జర్నలిస్టులకు భూములు ఇవ్వండి: విజయ్ దేవరకొండ

Vijay Devarkonda: తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్‌ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హెల్త్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం వరకూ ఈ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్ ను అందించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి,టీఎఫ్‌జెఎ అధ్య‌క్షుడు ల‌క్ష్మీ నారాయ‌ణ‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వై.జె.రాంబాబు, స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు స‌హా అసోసియేష‌న్ స‌భ్యులు.. జ‌ర్న‌లిస్ట్‌లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. జ‌ర్న‌లిస్టుల‌కు శ్రీనివాస‌రెడ్డి జర్నలిస్టులకు ల్యాండ్‌లు ఇప్పిస్తే.. అంద‌రూ చాలా సంతోషంగా ఉంటారు. నా కెరీర్ మొద‌టి నుంచీ జ‌ర్న‌లిస్టులు నాతోనే ఉన్నారు. నేను కాలేజ్‌లో ఉన్న‌ప్పుడు హాస్పిటల్ బిల్లులు ఎక్కువ వ‌స్తాయేమోన‌ని భ‌య‌ప‌డి హెల్త్ ఇన్‌స్యూరెన్స్ లు తీసుకునేవాడిని. కానీ అసలు అవి క్లెయిమ్ చేసుకోవాలో కూడా తెలిసేది కాదు. కొన్నిసార్లు రెన్యువ‌ల్‌కి డ‌బ్బులు ఉండేవి కాదు. అలా ఎన్నిటినో వ‌దిలేశాను. ఇప్పుడు ఈ అసోసియేష‌న్ ద్వారా అంద‌రూ దీన్ని ఉపయోగిచ్చుకుంటున్నారని  తెలిసి ఆనందంగా అనిపించింది. జీవితంలో ఎవ‌రికైనా మూడే ముఖ్యం. ఒక‌టి ఆరోగ్యం, రెండు ఆనందం, మూడు డ‌బ్బు. ఈ మూడిటిలో ఏది ఉన్నా, ఇంకోటి ఉంటుంది. ఉండి తీరుతుంది. జీవితంలో ఈ మూడు ఉంటాయి’ అని చెప్పుకొచ్చారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ `యూనియ‌న్‌కి నన్ను పిల‌వ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను. ఉద‌యం 4 గంట‌ల‌కు ప‌డుకున్నా. మీ ఇన్‌స్యూరెన్స్ మొద‌టడుగు వేయించింది నేనేన‌ట‌. హెల్త్ కోసం ఇవాళ తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు చేస్తున్న ఈ కార్య‌క్ర‌మం చూస్తుంటే సంతోషంగా ఉంది. అంద‌రికీ శుభాకాంక్ష‌లు. మీలో ఎక్కువ‌మంది 40 సంవత్సరాలు దాటిన‌వారే. కొన్ని సినిమాల్లో సొసైటీలో అత్యంత గౌర‌వ‌మున్న పాత్ర‌ల‌ను చూపించేవారు. అందులో జ‌ర్న‌లిస్ట్ కేర‌క్ట‌ర్ ఉంటుంది. ఎన్నో సినిమాల్లో జ‌ర్న‌లిస్టుల‌కు ఎంతో ఇంపార్టెన్స్ ఉండేది. ఇందాక శ్రీనివాస‌రెడ్డిగారు నిజాయ‌తీగా ఓ మాట చెప్పారు. జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్న‌ప్పుడు మ‌నం చేసేది, రాసేది సొసైటీకి ఉప‌యోగ‌ప‌డాల‌ని అన్నారు. అంద‌రూ బావుండాలి. వ్యాపారం చేయాలి. కానీ జ‌ర్న‌లిస్టుగా రాసే ప‌దం చాలా ముఖ్యం. సెల్‌ఫోన్ల‌ను నొక్కుతున్నారు కాబ‌ట్టి, కాస్త జాగ్ర‌త్త‌గా చూసి టైప్ చేస్తే పాజిటివ్ వైబ్ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. ఆ తరువాత విజయ్ దేవరకొండ తో తన రాబోయే సినిమా ఫ్యామిలీ స్టార్ గురించి చెబుతూ..’ఫ్యామిలీస్టార్ అని టైటిల్ పెట్టిన‌ప్పుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ని స్టార్‌గా చూపించ‌డానికి పెట్టుకున్నాన‌ని అనుకున్నారు. ఎక్క‌డో ఉన్న మీ కుటుంబాల‌ను పైకి తీసుకురావ‌డం కోసం కృషి చేసే మీలాంటి స్టార్ గురించి చూపిస్తున్నాం. ఎక్క‌డి నుంచో వ‌చ్చి, సొసైటీలో ఫ్యామిలీస్‌కి మ‌ర్యాద‌ను తెచ్చిపెట్టే ప్ర‌తి ఒక్క‌రూ ఫ్యామిలీస్టారే. అదే మా సినిమా కాన్సెప్ట్ ` అని చెప్పుకొచ్చారు.

అనంతరం ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ ‘జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌ను ఫ్రీగా ఇప్పించండి. తుపాకి క‌న్నా క‌లానికి భ‌య‌ప‌డ‌తాన‌ని అన్నారు నెపోలియ‌న్‌. ఎంతో మంది జ‌ర్న‌లిస్టులను క‌న్న‌ది సినిమా త‌ల్లి. సినిమా గురించి రాస్తున్నప్పుడు ద‌య‌చేసి సినిమాను చంపేయ‌కండి. కేర‌క్ట‌ర్ అసాసినేష‌న్ చేయ‌కండి. న‌న్న‌ని కాదు.. ఎవ‌రి గురించైనా రాసేట‌ప్పుడు ఆలోచించి రాయండి...’ అని తెలియజేశారు.

Also read Putin Win: రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ సంచలన విజయం... 24 ఏళ్లుగా ఏకచత్రాధిపత్యం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News