Manoj Mounika Wedding : మంచు మనోజ్ మౌనికల పెళ్లి వీడియో.. విజయమ్మ, విష్ణు హైలెట్

Manoj And Mounika Wedding Video మంచు మనోజ్, మౌనికల పెళ్లి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. తన ఫ్రెండ్స్ అయిన అనంత శ్రీరామ్ రాసిన పాటకు, అచ్చు సంగీతాన్ని అందించాడు. ఇప్పుడు ఈ స్పెషల్ పాటను తన పెళ్లి కోసం మనోజ్ వాడుకున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 11:08 AM IST
  • నెట్టింట్లో కొత్త జంట సందడి
  • పెళ్లి వీడియోను షేర్ చేసిన మనోజ్
  • వీడియోలో విజయమ్మ, విష్ణులు హైలెట్
Manoj Mounika Wedding : మంచు మనోజ్ మౌనికల పెళ్లి వీడియో.. విజయమ్మ, విష్ణు హైలెట్

Manoj And Mounika Wedding Video మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలో టాలీవుడ్ తారలు కనిపించారు. సాయి ధరమ్ తేజ్, బుల్లితెర తారలు ఇలా చాలా మంది కనిపించారు. మనోజ్ స్నేహితులు, భూమా ఫ్యామిలీ కనిపించింది. అయితే ఈ పెళ్లిలో విష్ణు ఎక్కువగా కనిపించలేదని అందరికీ తెలిసిందే. పెళ్లికి చుట్టపు చూపులా వచ్చి వెళ్లాడని అంటున్నారు. అయితే ఇప్పుడు మనోజ్ షేర్ చేసిన వీడియోలో విజయమ్మ, విష్ణు అలా మెరిశారు.

గత నెల మార్చిలో వీరిద్దరి వివాహాం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి డేటింగ్, ప్రేమ వ్యవహారం మీద గతంలో ఎన్నో సార్లు రూమర్లు వచ్చాయి. కానీ ఏనాడూ కూడా అధికారికంగా తమ రిలేషన్ గురించి చెప్పలేదు. పెళ్లి రోజే మనోజ్ అందరికీ చెప్పాడు. తన భార్య అంటూ మౌనిక గురించి చెప్పేశాడు మనోజ్. అలా మంచు వారింట్లో పెళ్లి సంగతులు అధికారికంగా చెప్పినట్టు అయింది.

మనోజ్ మౌనికల పెళ్లిని అంతా తానై ముందుండి నడిపించింది మంచు లక్ష్మీ. ఈ పెళ్లిలో విష్ణు అంటీ అంటన్నట్టుగా ఉన్నట్టు కనిపించింది. పెళ్లిలో సైతం మంచు విష్ణు ఎక్కువగా సేపు ఉండలేదని తెలుస్తోంది. ఏదో అలా వచ్చి వెళ్లాడని తెలుస్తోంది. అలా మంచు వారింట్లో ఉన్న విబేధాలు ఈ పెళ్లితోనే బయటకు వచ్చాయి.

Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్

పెళ్లికి సంబంధించిన వీడియోను మనోజ్ తాజాగా షేర్ చేశాడు. తన కోసమే ఓ పాటను రాయించుకున్నాడు. తన ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు ఈ పాటను కంపోజ్ చేశాడు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ పాట, అందులోని విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ ఒక్కడే ఈ పెళ్లికి హాజరైనట్టుగా తెలుస్తోంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manoj Manchu (@manojkmanchu)

ఇలాంటి ప్రేమ జీవితంలో ఒక్కసారే వస్తుందని అంటారు.. నాకు తెలుసు ఆ ప్రేమ నువ్వే అని.. నాకు నేను పూర్తిగా నీకు అర్పిస్తున్నాను.. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను.. నా ప్రేమను కురిపిస్తున్నందుకు థాంక్స్ అంటూ మనోజ్ వీడియోను షేర్ చేశాడు.

Also Read: Renu Desai Video : ఏడ్వాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితులు.. రేణూ దేశాయ్ పోస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News