Vijayashanthi Recalls Memories స్వర్గీయ నందమూరి తారకరామారావు తోటీ నటీనటుల్ని ఎంతగా గౌరవిస్తాడో అందరికీ తెలిసిందే. విజయశాంతి తనకు ఎదురైన ఓ ఘటనను తాజాగా పంచుకుంది. ఎన్టీఆర్ గొప్పదనాన్ని మరోసారి అందరికీ చెప్పింది. తాను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, తన సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యంశివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారితో కలిసి నటించే అవకాశం కలిగిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత 1985లో తన ప్రతిఘటన చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డును ఎన్టీఆర్ గారే ముఖ్యమంత్రిగా తనకు అందించారని తెలిపింది. ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించాడట.
బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ ఏవీఎం స్టూడియోలో చెబుతున్నాడట. అదే సమయంలో తాను చిరంజీవితో అదే స్టూడియోలో సినిమా చేస్తూ విజయశాంతి ఉందట. అయితే డబ్బింగ్ థియేటర్‌లో కలవడానికి వెళ్లినప్పుడు, వెలుతురు లేని వాతావరణంలో ఎన్టీఆర్ తనను సరిగా గమనించలేదని బాధపడిందట. ఆ మరుసటి రోజు షూటింగ్ కోసం విజయశాంతి హైద్రాబాద్‌కు వచ్చిందట. ఇక విజయశాంతి అలా బాధపడిందన్న విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. చెన్నైలోని ఆమె ఇంటికి వెళ్లాడట. అమ్మాయిని మేము చూసుకోలేదు. పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్‌తో ఎన్టీఆర్ చెప్పాడట.
ఆ సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తుగానే, గౌరవంగానే మిగులుతుందని విజయశాంతి గుర్తు చేసుకుంది. తాను హైదరాబాదులో ఉన్నానని, అక్కడి ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ "జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, క్షమించు" అని చెప్పాడట. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే అని చెప్పుకొచ్చింది
Also Read: Mem Famous Review: మహేష్ మెచ్చిన మేం ఫేమస్ రివ్యూ & రేటింగ్.. ఎలా ఉందంటే?
ఇక ఎన్టీఆర్ ఆతిథ్యం గురించి విజయశాంతి ప్రత్యేకంగా చెప్పింది. మధ్యాహ్నం 11 గంటలకల్లా లంచ్ తమ ఇంటి నుంచి శ్రీనివాస్ ప్రసాద్ గారు పంపడం, ఎన్టీఆర్ గారు ఎంతో ఆప్యాయంగా స్వీకరించటం జరిగేదని తెలిపింది. అదే గాకుండా తాను కలవడానికి వెళ్తే.. ఎంతో బిజీగా ఉన్న సమయంలో వెళ్లినా కూడా స్వయంగా టిఫిన్ వడ్డించి తినిపించేవారు. ఆయన ఆతిథ్యానికి మారుపేరు అని ఎంతో గొప్పగా చెప్పింది.
Also Read: Malli Pelli Movie Review: నరేష్-పవిత్రాల మళ్లీ పెళ్లి రివ్యూ అండ్ రేటింగ్.. సినిమా ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK