Kajal Sreeleela Dance Video: బాలయ్య పాటకు స్టెప్పులు ఇరగదీసిన కాజల్, శ్రీలీల.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో

Update on NBK 108: భగవంత్ కేసరి సినిమా సెట్ లో బాలయ్య సాంగ్ కు హీరోయిన్లు కాజల్ అగర్వాల్, శ్రీలీల అద్భుతమైన స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2023, 05:07 PM IST
Kajal Sreeleela Dance Video: బాలయ్య పాటకు స్టెప్పులు ఇరగదీసిన కాజల్, శ్రీలీల.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో

Kajal Aggarwal - Sreeleela Dance on Balakrishna's Song: నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్‌ రాంపాల్‌ విలన్‌గా నటించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 30న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టైటిల్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల ఈ మూవీ సెట్ లోకి కాజల్ అగర్వాల్ అడుగుపెట్టారు. అయితే గత మే నెలలో షూటింగ్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి.. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ మరియు స్టంట్ డైరెక్టర్ వెంకట్ మాస్టర్‌లతో కలిసి బాలయ్య పాటకు కొన్ని అద్భుతమైన డ్యాన్స్ స్టెప్పులు వేశారు. ఇప్పుడు కాజల్, శ్రీలీల వంతు వచ్చింది. సెట్‌లో బాలకృష్ణ సూపర్ హిట్ పాటకు హీరోయిన్లిద్దరూ డ్యాన్స్ చేశారు. బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహ నాయుడులోని 'చిలకపచ్చ కోకా' పాటకు కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీల చిందులేశారు. ఇందులో కథానాయికలు ఇద్దరూ పింక్ షర్టులు, బ్లూ జీన్స్ ధరించారు. 

Also Read: Adipurush Day 2 Collections: రెండో రోజు కూడా ఆగని కలెక్షన్ల వర్షం.. 200 కోట్ల క్లబ్ లో 'ఆదిపురుష్'..!

ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీని పై అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ''నేను వేసిన డ్యాన్స్ కు జెలస్ గా ఫీలై.. మా హీరోయిన్స్ ఇద్దరూ నాముందు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు'' అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై బాలయ్య ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: Rakesh Master Death: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x