Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌-క్రిష్‌ మూవీ టైటిల్‌ ఖరారు..ఫస్ట్‌ లుక్‌ విడుదల

VaishnavTej: 'ఉప్పెన' మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా నుంచి అప్ డేట్ వచ్చేసింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2021, 01:04 PM IST

    వైష్ణవ్‌ తేజ్‌-క్రిష్‌ మూవీ టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ విడుదల

  • ఓ నవల ఆధారంగా సినిమా చిత్రీకరణ
  • వైష్ణవ్ కు జోడీగా రకుల్
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌-క్రిష్‌ మూవీ టైటిల్‌ ఖరారు..ఫస్ట్‌ లుక్‌ విడుదల

VaishnavTej: మొదటి సినిమా ‘'ఉప్పెన’'తోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న వైష్ణవ్‌ రెండవ చిత్రం ప్రముఖ దర్శకుడు జాగర్లమూడితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘'కొండపొలం'’(Konda palem) అనే టైటిల్‌ని చిత్రబృందం ఖరారు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం మోషన్‌ పోస్టర్‌(Motion Poster), ఫస్ట్‌లుక్‌(First Look)ను చిత్రబృందం సోషల్‌మీడియా(Social Media) వేదికగా షేర్‌ చేసింది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

Also Read: 'RRR' movie update: అభిమానులకు మళ్లి నిరాశే.. వాయిదా పడ్డ 'RRR' రిలీజ్ డేట్..??

కాగా అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవన విధానాలు, వారి కష్టసుఖాలు తెలియజేస్తూ వచ్చిన ఓ నవల(Novel)ను ఆధారంగా చేసుకుని క్రిష్‌(Krish) ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వైష్ణవ్ ‌తేజ్‌(VaishnavTej)కు జంటగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌(Rakul Preet Singh) సందడి చేయనున్నారు. ఇందులో రకుల్‌ ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో కనిపించనుంది. ఎం.ఎం.కీరవాణి(M.M. Keeravani) సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల పంజా వైష్ణవ్‌ తేజ్‌(Vaishnav Tej) ఓ చిత్రాన్ని ఖరారు చేశాడు. కేతిక శర్మ కథానాయికగా, గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్‌ నటించనున్నాడు. మరోవైపు క్రిష్‌ పవన్‌(Pavan Kalyan)తో సోషియో ఫాంటసీ ‘హరిహర వీరమల్లు’ సినిమా తీస్తున్నాడు. కథానాయకగా నిధి అగర్వాల్‌(Nidhi Agarwal‌) నటిస్తోంది. నిధి బర్త్ డే సందర్భంగా పంచమిని పరిచయం చేసిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link -  https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News